ఎస్డిఎఫ్ నిధుల నుండి రూ.17 కోట్లు మంజూరు

# జీ.వో. నెంబర్ 384 ద్వారా నిధులు విడుదల చేసిన కేసీఆర్ ప్రభుత్వం

# అభివృద్ధి బాటలో నర్సంపేట డివిజన్
# ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 17 కోట్ల రూపాయలు మంజూరీ అయ్యాయి.కాగా ఈ నిధులను జీ.వో. నెంబర్ 384 ద్వారా కేసీఆర్ ప్రభుత్వం మంజూరి చేసింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందుకు సంబంధించిన జీఓ కాఫీ వివరాలను శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లోని మౌలిక వసతుల (మహిళా సంఘ భవనాలు, అన్ని కులాల కమ్యూనిటీ భవనాలు, కాంపౌండ్ వాల్స్, దేవాలయాల మరమ్మత్తులు, కాంపౌండ్ వాల్స్, అన్ని రకాల బిటి, సిసి, గ్రావెల్ రోడ్లు,సోలార్ లైటింగ్) అభివృద్ధి పనుల కోసం ఈ ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.ఆయా మండలాల పరిధిలో వెంటనే అభివృద్ధి పనులను గుర్తించాలని అధికారులకు ఎమ్మెల్యే పెద్ది ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *