ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి 13, జూన్ 

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుండి స్వీకరించిన ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు.

ప్రజావాణిలో వచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు.

భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టీ పరిష్కారం చూపాలన్నారు.

సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 19 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వచ్చిన అర్జీలు శాఖల వారీగా

రెవిన్యూ – 12

ఇరిగేషన్ – 1

ఎం సి సర్కిల్ – 6

టోటల్ – 19

డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published.