పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ హరీష్‌ రావు.

`హరీష్‌ వ్యూహం పన్నితే ప్రతిపక్షాలకు పద్మవ్యూహమే.

`వ్యూహాల అమలులో దిట్ట హరీష్‌ రావు.

`ఉద్యమకాలంలో తొలి సింహ గర్జన కరీంనగర్‌ సభ ఏర్పాట్లు….

`ఉద్యమ సమయంలో అనేక సభలు హరీష్‌ రావు పర్యవేక్షణలోనే…

`అన్ని ఉప ఎన్నికలకు హరీష్‌ రావే ప్రధాన ప్రచార కర్త.

`అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేతం బాధ్యతలన్నీ హరీష్‌ రావుకే…

`2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ప్రజాశీర్వాద సభలకు హరీష్‌ రావే ప్రాతినిధ్యం.

`ఎన్నికల ప్రచారంలో అనేక నియోజకవర్గాలలో సుడిగాలి ప్రచారం.

`గజ్వేల్‌ ప్రచార బాధ్యతలు కూడా హరీష్‌ రావుకే…

`కొడంగల్‌ లో రేవంత్‌ ను ఓడిరచిన ఘనత.

`బిఆర్‌ఎస్‌ తొలి సభ సక్సెస్‌ క్రెడిట్‌ హరీష్‌ దే…

`ఖమ్మం సభ విజయంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌.

`జాతీయ స్థాయిలో బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభూతో నభవిష్యతి.

`వేధిక సాక్షిగా సిఎం. కేసిఆర్‌ ప్రశంసలు.

`పది రోజులపాటు నిర్విరామ కృషి.

`పండగ నాడు కూడా పార్టీ సభ పనుల్లోనే…

`పార్టీలో ఆల్‌ ఇన్‌ వన్‌ లీడర్‌ హరీష్‌ రావే… 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయం, ప్రజా సేవ, సామాజిక సేవ, ఏక కాలంలో నిర్వర్తించే పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ తెలంగాణ ఉద్యమకారుడు, మంత్రి హరీష్‌ రావు. నమ్మకం అనే పదానికి పర్యాయం మంత్రి హరీష్‌ రావు. తను నమ్మిన వారందరికీ అభయం అందిస్తాడు. పార్టీకి ఎల్లవేళలా అండగా వుంటాడు. పార్టీ తొలి అడుగు పడడానికి ముందు నుంచే ఉద్యమ కార్యాచరణలో మమేకమైన నాయకుడు మంత్రి హరీష్‌ రావు. అలాంటి హరీష్‌ రావు రాజకీయ ప్రస్థానం విశిష్టమైనది. స్పూర్తి దాయకమైనది. ఆచరణాత్మకమైనది. ఒక వ్యక్తి అంకిత భావం ఎంత ఉన్నత స్థాయికైనా తీసుకెళ్తుందని చెప్పడానికి హరీష్‌ రావు వ్యక్తిత్వమే నిదర్శనం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ రాజకీయంలో అడుగులు వేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షణం తీరిక లేని జీవితం గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. పండగైనా, పబ్బమైనా, పగలైనా, రాత్రైనా, ఎండనక, వాననక ప్రజల్లోనే ప్రజలతోనే ఆయన జీవితం… నిత్య జీవన యానం. ఇలాంటి నాయకులు చాలా తక్కువగా వుంటారు. ప్రజలకు ఒక్క పూట కూడా ఆయన దూరంగా వుండరు. సరిగ్గా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కరోనా సోకినా కూడా విశ్రాంతి తీసుకోకుండా, ఇంటి నుంచి కూడా అవిశ్రాంతంగా పని చేసిన నాయకుడు హరీష్‌ రావు. ఇదే సమయంలో ప్రజలకు అవసరమైన ఇమ్యూనిటీ కిట్లను అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే హరీష్‌ రావు ప్రజలకు చేసే సేవలు లెక్కలేనన్ని… సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎవరు ఫోన్‌ చేసినా, సామాన్యుడు కష్టం చెప్పుకోవడానికి వచ్చినా వెంటనే స్పందిస్తారు. అవసరమైన సాయం వెంటనే అందేలా చూస్తారు. అది అనారోగ్య సమస్యలైనా, కొన్ని సార్లు ఆర్థికపరమైన ఇబ్బందులైనా స్పందించడం ఆయనకే చెల్లింది. ఉద్యమ సమయంలో కూడా అభివృద్ధికి నమూనాగా సిద్దిపేటను తీర్చిదిద్దారు. ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ను అన్ని రంగాలలో ముందుంచారు. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే సిద్దిపేట అని చెప్పుకునేలా చేశారు. హరీష్‌ రావు అంటే జనానికే కాదు, పశు, పక్షాదులకు కూడా ఇష్టమే….సిద్దిపేట లో ఓ కార్పొరేటర్‌ ఇష్టంగా పెంచుకునే కోళ్లు, మంత్రి హరీష్‌ రావు వస్తున్నాడని అంటే పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాయట…అంతగా హరీష్‌ రావు పేరు సిద్దిపేటకు ఇష్టమైంది. ఆయన నాయకత్వం వరమైంది. అలాంటి హరీష్‌ రావు పార్టీ కోసం, తెలంగాణ కోసం చేసిన కృషి అనితర సాధ్యమైనది. 

పొలిటికల్‌ ఆల్‌ రౌండర్‌ హరీష్‌ రావు అని చెప్పడం కూడా ఇంకా ఏదో వెలితిగానే వుంటుంది.

 అసలు రాజకీయాలలో వున్న వాళ్లు ఎలా వుండాలి. ప్రజలకు ఎలా చేరువ కావాలి. ఎలా సేవ చేయాలి. అందుకు నాయకులు పడే శ్రమ ఎంత? అన్న దానిపై పుస్తకం రాస్తే హరీష్‌ రావు నిత్య జీవితం ఒక రాజకీయ నిఘంటువు అవుతుంది. అలాంటి హరీష్‌ రావు రాజకీయంగా వేసే అడుగులు ప్రత్యర్థులు అంచనా వేయలేరు. సిద్దిపేట రాజకీయాలలో ఆయన అడుగుపెట్టిన తరుణం నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఎదురుగా నిలబడేందుకు ప్రతిపక్షాలకు ధైర్యం చాలదు. పార్టీల పరంగా పోటీ చేయాలన్నదే తప్ప, హరీష్‌ రావు మీద గెలవడం అన్నది సాధ్యం కాదన్నది వాళ్లకు కూడా తెలుసు. అంతే కాదు సమీప భవిష్యత్తులో హరీష్‌ రావు ను రాజకీయంగా ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు. అంతగా ప్రజల్లో మమేకమయ్యారు. ప్రతి ఇంటిలో తానో సభ్యుడయ్యాడు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఆయనను ఒక నాయకుడిగా కన్నా, ఒక ఆత్మీయుడిగానే అందరూ చూస్తారు. అంతలా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు హరీష్‌ రావు. ఇక ఇతర నియోజకవర్గాలలో కూడా ఎన్నికల బాధ్యతలు హరీష్‌ రావుకు అప్పగిస్తే చాలు…అక్కడ విజయమే…అలా ఆయన అనేక ఎన్నికలు, ఉప ఎన్నికలలో ముందుండి ప్రచారం చేసి గెలిపించారు. హరీష్‌ వ్యూహం పన్నితే ప్రతిపక్షాలకు పద్మవ్యూహమే. వ్యూహాల అమలులో దిట్ట హరీష్‌ రావు.

ఉద్యమకాలంలో తొలి సింహ గర్జన కరీంనగర్‌ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.

 నిజానికి అలాంటి సభ ఏర్పాటు వ్యవహారం హరీష్‌ రావు కు కొత్త. అయినా పట్టుదలతో ఆయన చేసిన కృషి ఎలా వుంటుందనేది అప్పుడే నిరూపితమైంది. ఉద్యమ సమయంలో అనేక సభలు హరీష్‌ రావు పర్యవేక్షణలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయిన వరంగల్‌ సభ కూడా ఆ రోజుల్లో హరీష్‌ రావు నాయకత్వంలోనే జరిగింది. తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికలకు హరీష్‌ రావే ప్రధాన ప్రచార కర్త. ఎమ్మెల్యేలు రాజీనాలు చేసిన సందర్భంతో పాటు, సార్వత్రిక ఎన్నికలను కూడా తన భుజాన వేసుకొని, పార్టీకి విజయాలు అందించిన నాయకుడు హరీష్‌ రావు. అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేతం బాధ్యతలన్నీ హరీష్‌ రావుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అప్పగించేవారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ప్రజాశీర్వాద సభలకు హరీష్‌ రావే ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల ప్రచారంలో అనేక నియోజకవర్గాలలో సుడిగాలి ప్రచారం చేశారు. గజ్వేల్‌ ప్రచార బాధ్యతలు కూడా హరీష్‌ రావుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అప్పగించారు. కొడంగల్‌ లో రేవంత్‌ ను ఓడిరచిన ఘనత కూడా హరీష్‌ రావుకే దక్కింది. ఆ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో పాత్రదారి రేవంత్‌ రెడ్డిని ఓడిరచి తన రాజకీయ వ్యూహాత్మక చాణక్యం ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించారు. దటీజ్‌ హరీష్‌ రావు అనిపించారు. 

బిఆర్‌ఎస్‌ తొలి సభ సక్సెస్‌ క్రెడిట్‌ హరీష్‌ దే…

ఈ మాట బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులంతా ముక్త కంఠంతో అంటున్న మాట. ఆ సభకు ముందు పార్టీ శ్రేణుల్లో కొంత ఎక్కడో అసంతృప్తి వుందనే వాదనలు వినిపించాయి. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద వున్న నమ్మకం ప్రజల్లో మరింత పెరిగిందన్నది బిఆర్‌ఎస్‌ సభ తో రుజువైందని అనుకుంటున్నారు. 

ఖమ్మం సభ విజయంతో బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. జాతీయ స్థాయిలో బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభూతో నభవిష్యతి అనే మాటనే హజరైన డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి విజయ్‌ లు కితాబిచ్చారు. వేధిక సాక్షిగా హరీష్‌ రావుపై సిఎం. కేసిఆర్‌ ప్రశంసలు కురిపించారు. అదే వేధిక నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా సభ విజయంపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. 

పది రోజులపాటు నిర్విరామ కృషి.

బిఆర్‌ఎస్‌ తొలి సభ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం జరిగిన నుంచి హరీష్‌ రావు అదే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాల మేరకు దాదాపు పది రోజుల పాటు నిర్విరామంగా పని చేశారు. అంతే కాదు ఆరోగ్య శాఖ మంత్రిగా అదే రోజు జరిగే కంటి వెలుగు కార్యక్రమం కూడా ప్రారంబించారు. అందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకోవడానికి అవసరమైన రివ్యూ మీటింగులు ఏర్పాటు చేశారు. అదే రోజు ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభోత్సవ పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏక కాలంలో చరిత్రలో నిలిచిపోయేలా జరగిన ఖమ్మం తొలి బిఆర్‌ఎస్‌ సభ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే, తీరిక లేకుండా ఇతర పనులను దగ్గరుండి చూసుకోవడం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకమైన పనులన్నీ హరీష్‌ రావు మాత్రమే చూసుకుంటారు. 

పండగ నాడు కూడా పార్టీ సభ పనుల్లోనే…

ఓ వైపు బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులందరూ సంక్రాంతి పండుగ వేళ కుటుంబంతో గడిపితే హరీష్‌ రావు ఖమ్మం సభ ఏర్పాట్లలోనే నిమగ్నమై వున్నారు. బిఆర్‌ఎస్‌ తొలి సభ కావడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టిఆర్‌ఎస్‌ స్థాపన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, అంతకు మించి హరీష్‌ రావు ఖమ్మం సభ మీద దృష్టి సారించారు. అందుకే ఖమ్మం సభ అంత విజయవంతమైంది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక పండగలు కూడా ప్రజలతో చేసుకున్న నాయకుడు హరీష్‌ రావు. ప్రజలు ఎక్కడుంటే అక్కడే హరీష్‌ రావుకు పండగ. అందుకే పార్టీ లో ఆల్‌ ఇన్‌ వన్‌ లీడర్‌ హరీష్‌ రావే…అన్నది అందరూ ఒప్పుకునే మాట. అందరూ చెప్పుకునే మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *