నేటి నుండి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం

నేటి నుండి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం

హన్మకొండ, నేటిధాత్రి : హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీవివేకానంద యోగ కేంద్రంలో మాధవ స్మారక సమితి ఆధ్వర్యంలో బుధవారం నుండి మే 7వ తేదీ వరకు ఉదయం 9 నుండి 11:30గంటల వరకు నగరంలోని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస వేసవి ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు అల్వాల బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. వారంరోజులపాటు నిర్వహించే ఈ ఉచిత శిబిరంలో యోగాసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు, భారతీయ సాంప్రదాయక ఆటలు, నీతి కథలు, సంస్క త భాష తరగతులు, ఆకర్షణీయమైన చేతిరాత, గీత్‌, భజనలు, శ్లోకాలు, సుభాషితాలపై శిక్షణ ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. శిబిరంలో పాల్గొనాలనే ఆసక్తి గల వారు రామనాథం, సెల్‌ నెంబర్‌ 9177571379లో సంప్రదించాలని కోరారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *