గుడుంబా తయారీ చట్ట రీత్యా నేరం, చట్ట పరమైన చర్యలు తప్పవు – వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ!
వేములవాడ రూరల్ నేటి దాత్రి
వేములవాడ రూరల్ మండల పరిధిలో ని నూకల మర్రి గ్రామం లో వ్యవసాయ పొలాల వద్ద గుడుంబా తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు గుడుంబా తయారు చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్టు ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ నూకలమర్రి గ్రామం లో వ్యవసాయం పొలం వద్ద రాజు నాయక్ వద్ద నుండి 4 లీటర్లు గుడుంబా, మహేష్ నాయక్ వద్ద 3 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకొని, బెల్లం పానకం 45 లీటర్లు ను పారబోయటం జరిగింది, ఎవరైనా నిషేధిత గుడుంబా ని తయారు చేసిన అమ్మినా కూడా చట్ట పరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని, ఎలక్షన్ కోడ్ అమలు లో వుంది కాబట్టి అక్రమంగా లిక్కర్ అమ్మిన కూడా కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.