నిబంధనలు బేఖాతర్‌
‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ ‘ ఇష్టారాజ్యం
హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు బేఖాతర్‌ చేస్తోంది. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహస్తూ విద్యావ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తుంది. సరైన గ్రౌండ్‌, పార్కింగ్‌ స్థలం, మంచి నీటి వసతి లేకపోవటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటానికి కారణాలేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వహకులకు, అధికారుల మధ్య రహస్యపు ఒప్పందాలు ఉండటం ఫలితంగానే చర్యలు చేపట్టకుండా గుమ్మున ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఫైర్‌సేప్టీ, లైబ్రరీ, ల్యాబ్‌, తదితర సౌకర్యాల గురించి చెప్పనక్కరే లేదు. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కాలేజీ నిర్వహణకు ఎలా పర్మిషన్‌ ఇచ్చారో అధికారలకే తెలియాల్సి ఉంది. సిటీ మహిళా డిగ్రీ కళాశాల అసౌకర్యాలతో నిర్వహించబడుతుందని అధికారులకు తెలిసినా నిద్ర మత్తులో ఉండటం వీరి మధ్య రహస్యపు ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలను బలపరుస్తున్నాయనేది గమనార్హం. పిచ్చిగడ్డితో చదును లేనటుంటి అరకొర స్థలాన్ని గ్రౌండ్‌గా చూపిస్తే అధికారులు పర్మిషన్‌ ఇవ్వటం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పర్మిషన్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ అయినటువంటి ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లోనే ఉందా…? అధికారులకు మరో చోట సౌకర్యాలు చూపి కాగితాల్లో పర్మిషన్‌ తీసుకొని కాలేజీని కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారా అనే సందేహాలకు కలుగుతున్నాయి. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కాలేజీ నిర్వాహణ నిగ్గు తేల్చాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిద్రమత్తులో ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ యదేచ్ఛగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కాలేజీని నిర్వహిస్తున్న యాజమాన్యం తీరు పట్ల సమగ్ర విచారణ జరిపి అధికారులు చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సి ఉంది.
కదిలించే వారే లేరనే రితీలో కాలేజీ యాజమాన్యం….
”మాకు అందరూ తెలుసు…మమ్మల్ని ఎవరూ కదిలించ లేరు.. అధికారులు మా పక్షమే…అధికారుల ఆశీస్సులు మాకు ఉన్నాయి”. అనే  రితిలో సిటీ మహిళా డిగ్రీ కలేజీ నిర్వహకులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు చర్యలు చేపట్టకపోవటం ఇందుకు బలాన్ని చేకూర్చుతుంది. కాలేజీ అసౌకర్యాలకు నిలయంగా ఉందని, మహిళా కాలేజీ నిర్వహణకు సరిపడే విధంగా పరిసరాలు, సౌకర్యాలు లేవని అధికారులకు తెలియదా..? ఒకవేళ తెలిసినా యాజమాన్యంతో రహస్యపు ఒప్పందాల్లో భాగంగానే అధికాలు గుమ్మనకుండా ఉంటున్నారా…? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నిర్వహణ పట్ల సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.