కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి
పరకాల నేటిధాత్రి(టౌన్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “గృహలక్ష్మి పథకం” కింద లబ్ధిదారుల నుండి స్వీకరించే దరఖాస్తుల గడువు మూడు రోజులే ఇవ్వడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి కోరారు.దరఖాస్తులు స్వీకరించే గడువు మద్యం షాపులకు మరియు ఇతర అప్లికేషన్లను 15 రోజులు ఇచ్చి నిరుపేదలకు ఉపయోగపడే ”గృహలక్ష్మి”పథకానికి మాత్రం రెండు రోజులు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉందని అందులో ఇచ్చిన నిబంధనల ప్రకారం మహిళల పేరుపైన కులం, ఆదాయం సర్టిఫికెట్స్, లోకల్ సర్టిఫికెట్స్ మరియు ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేయకపోవడంతో అప్లికేషన్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని రేషన్ కార్డు లేని కొందరు ఎలా అప్లికేషన్ చేయాలని నిరుపేదలు నిరుత్సాహానికి గురవుతున్నారని అన్నారు.ఈ గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసే మూడు లక్షల రూపాయలు కేవలం కూలీల ఖర్చులకు సరిపోలేని దుస్థితి ఉన్నదని, ఎంతవరకు న్యాయమని అన్నారు.కుల,ఆదాయం సర్టిఫికెట్స్ మరియు రేషన్ కార్డు కూడా లేని కొందరు ఇబ్బందులు గురవుతున్నారని నిరుపేదలు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ప్రభుత్వ గడువును వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు.