కేసిఆర్‌ నాయకత్వమే నవశకం.

`తెలంగాణ పోరాటం టిఆర్‌ఎస్‌!

` రైతు ఉద్యమం బిఆర్‌ఎస్‌!!

`వస్తున్నాయి బిఆర్‌ఎస్‌ రథచక్రాలు.

`కదులుతున్న బిజేపి కూసాలు.

`మళ్ళీ ప్రాంతీయ పార్టీలలో చిగురిస్తున్న ఆశలు.

`బిఆర్‌ఎస్‌తో కలిసి సాగేందుకు సన్నాహాలు.

`హైదరాబాదు రానున్న పంజాబ్‌ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు

`వివిధ రాష్ట్రాలను నుంచి కేసిఆర్‌ వద్దకు నేతలు

`డిల్లీలో మళ్ళీ కదం తొక్కిన రైతులు.

`గతంలో రైతులకు కేసిఆర్‌ మద్దతు.

`ఇప్పుడు కేసిఆర్‌ భరోసా రైతులు ముందుకు.

`దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ తో రైతు సంఘటితం.

`కేసిఆర్‌ సభలతో పెరగనున్న చైతన్యం..

`రైతుల్లో కనిపిస్తున్న ఉత్తేజం.

`రైతు రాజ్య స్థాపనకు శ్రీకారం.

` కేసిఆర్‌ నాయకత్వం కోసం రైతుల ఆహ్వానం.

`దేశవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ సంచలనం.

`కేసిఆర్‌ అంటేనే ఒక ప్రభంజనం.

`బిఆర్‌ఎస్‌ నేతృత్వంలోనే రైతుకు చంద్రోదయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజల్లోనుంచి ఉద్భవించిన నాయకుడికి ప్రజలకు ఎలా సేవ చేయాలన్నదానిపై నిరంతర మధనం వుంటుంది. ప్రజలకు ప్రతి నిమిషం ఏదో మంచి చేయాలన్న సంకల్పం ఉద్భవిస్తూనే వుంటుంది. అలాంటి వాటినుంచే సంక్షేమ పథకాలు నాయకుల మదిలో నుంచి పురుడు పోసుకుంటాయి. ప్రజలకు ఫలాలు అందజేస్తుంటాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంటాయి. వారి బతుకులకు భరోసా కల్పిస్తుంటాయి. ప్రతి దశలో ఒక నాయకుడు విజన్‌ అవుతాడు. దారి చూపుతాడు. దిక్సూచిగా మారుతాడు. రేపటి సమాజ నిర్మాణం కోసం బలమైన పునాదులు నిర్మిస్తాడు. భవిష్య వ్యవస్ధను పటిష్టం చేస్తాడు. అలాంటి నాయకుల్లో కేసిఆర్‌ అగ్రగణ్యుడు. అవును. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా చూడని విధంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇన్ని రకాల పధకాలు అమలు చేస్తూ, తెలంగాణను ఎనమిదేళ్లలో బంగారు మయం చేసిన నాయకుడు కేసిఆర్‌. అలాంటి నాయకుడు ఇక దేశానికి దిక్సూచీ అయ్యే తరుణం ఆసన్నమైతే. అది నిజంగా కేసిఆర్‌ నాయకత్వం మన దేశానికే నవశకం కానున్నది.తెలంగాణ అంటే ఒకప్పుడు ఉమ్మడి పాలకులకు చీదరింపు. చిన్న చూపు. ఆ పదం వాడాలంటే కూడా ఇష్టం లేని కాలం. వెనుకబడిన ప్రాంతంమన్నారే గాని, దాన్ని ముందట పడేయాలన్న ఆలోచన ఏనాడు చేయలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఏ నాయకుడు తీసుకోలేదు. తెలంగాణ ప్రాంతాన్ని మరింత వెనుకబాటుకు గురిచేసే కుట్రలే చేశారే తప్ప, ఏ రంగంలోనూ కనీస ప్రగతికి నోచుకోలేదు. అందుకే కేసిఆర్‌ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. టిఆర్‌ఎస్‌ రూపంలో పోరాటం చేసింది. తెలంగాణ అంతా ఏకం చేసింది. తెలంగాణ సాధించింది. కేసిఆర్‌ నాయకత్వం మూలంగా తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. అంతటితో ఆగలేదు. అసలు కథ అక్కడే మొదలైంది. తెలంగాణ వస్తే మహా అంటే కొన్ని కొలువులు వస్తాయి అనుకున్నారు. ఇక నీళ్ల సంగతి విషయంలో ఒక్క కేసిఆర్‌కు తప్ప మరెవరికీ స్పష్టత లేదు. అందుకే ఎవరూ ఊహించని సాగునీటి ప్రాజెక్టులను తలపెట్టారు. తెలంగాణను మూడేళ్లలో సస్యశ్యామం చేశాడు. మొదటి మూడు సంవత్సరాలలో తెలంగాణలోని 46వేల చెరువులకు పూర్వ కళ తెచ్చాడు. వాటిని నిండైన గంగాళాలు చేశాడు. ఏడాది పొడవునా చెరువులు నీళ్లతో కళకళలాడేలా చేశాడు. ఇదీ ఒక పాలకుడి విజయం. తెలంగాణ ప్రజలకు నవోదయం. అయితే తెలంగాణలో ప్రాజెక్టు అన్న పదం కూడా విననపడకుండా ఉమ్మడి పాలకులు చేశారు. తెలంగాణ రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, నాలుగేళ్లలో పూర్తి చేసి, నీటి ఫలాలు అందించాడు. తెలంగాణను కేసిఆర్‌ కోటి ఎకరాల మాగాణ చేశాడు. ఇప్పుడు తెలంగాణలో పండుతున్న సిరులు, దేశ మంతా పండేందుకు, దేశమంతా సుసంపన్నమయ్యేందుకు బిఆర్‌ఎస్‌ రధ చక్రాలు వస్తున్నాయి.దాంతో బిజేపి కూసాలు కదులుతున్నాయి. అసలు తెలంగానలోనే టిఆర్‌ఎస్‌ను లేకుండా చేద్దామని కుట్రలు పన్నుతున్న బిజేపికి దిమ్మ తిరిగేలా కేసిఆర్‌ పథకం రచించారు. మొదటిసారి దక్షిణాది నుంచి కేసిఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉత్తరాధి పెత్తనంలో సాధించలేనిది, ఇప్పుడు దక్షిణాది నేత శకంలో దేశమంతా సుభిక్షమయ్యేందుకు దారులు పడనున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమౌతూ, బిఆర్‌ఎస్‌కు తోడుగా నిలవనున్నాయి. బిఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి అడుగులేయనున్నాయి. అందుకు కేసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధనే కాదు, ప్రగతి ప్రస్ధానం కూడా అందుకు కారణమౌతోంది. ఉత్తరాధిలోని పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు కూడా బిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారంటే కేసిఆర్‌ నాయకత్వంలో వున్న బలమెంతో అర్ధం చేసుకోవచ్చు. బిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉత్తర ప్రదేశ్‌ మాజీ సిఎం. అఖిలేష్‌ యాదవ్‌ లాంటి నాయకులు హాజరయ్యారంటేనే అక్కడ కూడా బిఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు వుందనేది అర్ధమౌతూనే వుంది. ఇదిలా వుంటే ఈ రోజు పంజాబ్‌ సిఎం కూడా కేసిఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వస్తున్నారంటే ఆయన నాయకత్వంలో రాజకీయాలను అనుసరించాలని ఆప్‌ కూడా చూస్తున్నట్లే లెక్క. ఇదిలా వుంటే ఇప్పటికే నిత్యం దేశంలోని అనేక రాష్ట్రాలనుంచి కూడా రైతు నాయకులు వస్తున్నారు. కేసిఆర్‌ను కలుస్తున్నారు. అక్కడ బిఆర్‌ఎస్‌ పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నారు.

వారి వారి రాష్ట్రాలలో సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సమాచారం అందిస్తున్నారు. డేట్లు ఫిక్స్‌ చేసుకుంటున్నారు. ఇలా దేశమంతా బిఆర్‌ఎస్‌ ఒక్కసారిగా ప్రభంజనంగా మారిపోనున్నదని చెప్పడంలో సందేహం లేదు. ఒకనాడు డిల్లీలో కదం తొక్కిన రైతలకు ఆనాటి నుంచి బిఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మద్దతిచ్చారు.దేశంలో కేంద్ర ప్రభుత్వవైఖరిని ఎండగట్టిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందని రైతులను చైతన్యం చేసింది కేసిఆర్‌. ప్రధాని మోడీని నిలదీసింది కేసిఆర్‌. ఆఖరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంలో రైతులు చేసిన ఉద్యమంతోపాటు, కేసిఆర్‌ ఇచ్చిన మద్దతు కూడా ఒక కారణం. అందుకే దేశంలోని రైతులందరికీ కేసిఆర్‌ అంటే ఒక నమ్మకం. ఒక విశ్వాసం. ఆయనపై భరోసా. అందుకే మళ్లీ ఉద్యమం మొదలు పెట్టారు. డిల్లీ వీధులు దద్దరిల్లేలా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కేసిఆర్‌ భరోసాతో రైతులంతా ముందుకు సాగుతున్నారు. వారికి కేసిఆర్‌ అండ వుందన్న బలమైన నమ్మకంతో వారు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సాధిస్తేగాని ఆ ప్రాంతం బాగుపడదని పోరాటంచేశాడు. తెలంగాణ సాధించాడు. ఇప్పుడు కూడా దేశమంతా సస్యశ్యామలం కావాలంటే, రైతు రాజు కావాలంటే, సగటు సామాన్య భారతీయుని జీవితం చిరుగురించాలంటే బిఆర్‌ఎస్‌ రావాలి. రైతుకోసం ఉద్యమించాలి. రైతులకు అండగా నిలవాలన్న సంకల్పంతో కేసిఆర్‌ భయలుదేరారు. ఆనాటి ఉద్యమ ఆకాంక్షే ఇప్పుడూ వుంది. మరింత నిండుగా వుంది. ఆనాడు కేసిఆర్‌తో ఎవరూలేరు. కాని ఇప్పుడు కేసిఆర్‌తో దేశమే వుంది. దేశమంతా కేసిఆర్‌ నాయకత్వం కోసం ఎదరుచూస్తోంది. రైతు సంక్షేమ కోరుకుంటున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌ వస్తే తమ జీవితాలు బాగుపడతాయనకుంటున్నారు. దేశమంతా సస్యశ్యామలమౌతుందనుకుంటున్నారు. అందుకే కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు అనేక రాష్ట్రాలలో రైతు నాయకులు కదం తొక్కుతున్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. దేశ రాజకీయాలను సమూలంగా మార్చే శక్తి వున్న కేసిఆర్‌ అడుగులో అడుగులు వేసేందుకు రైతు నాయకులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు. ప్రజలను కదిలిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ వైపు చూసేలా చేస్తున్నారు. ఇప్పుడు కేసిఆర్‌ ఒక బలమైన శక్తి. రైతు జీవితాలకు వెలుగౌతున్న నాయకుడు. బిఆర్‌ఎస్‌ రూపంలో ఒక ప్రభంజన శక్తిగా మారుతున్నాడు. దేశాన్ని మార్చేందుకు కేసిఆర్‌ సిద్దపడుతున్నాడు. దేశంలో రైతును రాజు చేయాలన్న గొప్ప ఆశయంతో హస్తిన వైపు సాగుతున్నాడు. తెలంగాణ సాక్షిగా, కర్నాటక తోడు, మహారాష్ట్ర నీడగా, ఉత్తర ప్రదేశ్‌ అండగా, పంజాబ్‌ బాసటగా, దేశమంతా కేసిఆర్‌ను ఆహ్వానిస్తోంది. కేసిఆర్‌ దేశాన్ని సుబిక్షం చేస్తాడని ఎదరుచూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *