ఔషధ ప్రదాత ఫార్మ విజేత

సామాన్య రైతు కుటుంబం…

అత్యున్నత శిఖరాల విజయం…

భోధన వృత్తి కోరుకుంటే, ఔషద తయారీ ప్రస్థానం…

తక్కువ ఖర్చుతో, మేలైన మందులు అందించడమే లక్ష్యం…

రూ.600 జీతంతో మొదలైన జీవితం…

రూ. 45 లక్షలతో సొంత వ్యాపారం…

138 దేశాలకు విస్తరించిన సామ్రాజ్యం…

300 రకాల మందుల తయారీలో కొత్త అధ్యాయం…

బర్డ్‌ ఫ్లూ కు చెక్‌….

స్వైన్‌ ఫ్లూ స్టాప్‌….

ఎయిడ్స్‌ రోగులకు వరం….

తాజాగా కరోనా విరుగుడు ఔషదం…

విజయాలకు లెక్కే లేదు…విజయ పరంపర ఆగేదేలేదు…

బెదిరేది లేదు…అదిరేది లేదు…ఎక్కడా తగ్గేదే లేదు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక మామూలు వ్యక్తి కూడా అద్భుతాతలు సృష్టించొచ్చు. అనుకున్న లక్ష్యాలను శర వేగంగా నెరవేర్చుకోవచ్చు. విజయాల పరంపర ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడొచ్చు. ఎదగాలన్న కసి, కృషి, పట్టుదల, అంకితభావం, అవరోధాలకు వెరవని తనం, లక్ష్యసాధనలో అలుపెరగని ప్రయాణం చేసి విజేతగా నిలువొచ్చు. అని నిరూపించిన వ్యక్తి బండి పార్ధసారధి రెడ్డి. నిరంతర నిర్మాణాత్మక ఆలోచనలు, కార్యదక్షత విజయాలందిస్తాయి. తిరుగులేని శక్తిగా తయారు చేస్తాయి. అలాంటి వాళ్లు ఆదర్శవంతులౌతారు. యువతకు స్పూర్తిదాయకమౌతారు.

కొత్త తరం ఆలోచనలకు వేధికౌతారు. నూతన ఆవిష్కరణలకు వేధికౌతారు. వారు ఎంచుకున్న రంగంలో ఎదరులేని శక్తిగా నిలుస్తారు. విజయాల బావుటా ఎగురవేస్తారు. హెటిరో పార్ధ సారధి రెడ్డిలా నిలబడి విజయకేతనం ఎగురవేస్తారు. తిరుగులేని శక్తినని నిరూపిస్తారు. లక్ష్య సాధనలో ఒక్కొమెట్టును పేర్చుకుంటూ ఎదుగుతారు. ఆదర్శానికి కేఆరాఫ్‌ అడ్రస్‌ అవుతారు. కొన్ని సార్లు అనుకోకుండా అద్భుతాలు జరగొచ్చు. వాటిని ముందే పసిగట్టి ముందుకు సాగొచ్చు. తాను వెళ్లాలనుకునే దారికి ముందే మరో దారి ఎదురైతే అక్కడ కూడా విజయాల బాట వేసుకోవచ్చు. తిరుగులేని విజాయలు సాంతం చేసుకోవచ్చు. అలా లెక్చరర్‌ అవ్వాలనుకొని, సైంటిస్ట్‌ అయ్యారు. అక్కడే స్ధిరపడక ఔషదతయారీ రంగంలో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఆ రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా దేశ అత్యున్నత చట్ట సభ అయిన రాజ్యసభకు ఎంపికయ్యారు. మరో కొత్త లోకాన్ని చూస్తున్నారు. 

బండి పార్ధసారధి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు.పిహెచ్‌డి చేశారు. తదనంతరం లెక్చరర్‌ కావాలనుకున్నారు. కాని అనూహ్యంగా ఓ గొప్ప వ్యక్తి నుంచి కబురొచ్చింది.

జీవితంలో ఊహించని మలుపును మోసుకొచ్చింది. అనుకోకుండా ఎదురైన అవకాశాలను కూడా అనుకూలంగా మల్చుకునేవారే నిజమైన విజేత అని మరోసారి పార్ధ సారధి రెడ్డి నిరూపించుకున్నారు. రెడ్డీస్‌ ల్యాబ్‌ అధినేత అంజిరెడ్డి నుంచి పిలుపొచ్చింది. తమ సంస్ధలో చేరమని ఆహ్వనం అందింది. జీతం కేవలం. రూ. 600 మాత్రమే…అయినా ఆలోచించలేదు. ఆ అంజిరెడ్డి ఆహ్వానాన్ని వదులుకోలేదు. చదవిన చదువుకు లెక్చరర్‌గా స్ధిరపడితే చాలు అనుకున్న సందర్భం నుంచి, చదవిన చదువుకు సార్ధకత చేకూర్చే ఎదురైన మార్గంలో పయనించారు. అనుకోని అతిధి నుంచి ఆహ్వానం అందింది. అయితే అలాంటి సమయంలో భవిష్య మార్గం ఎంచుకోవడం ఒక రకంగా కత్తిమీద సాము లాంటిదే. అందుకు ఎంతో ఆత్మ విశ్వాసం కావాలి. కొండంత ధైర్యం కావాలి. ప్రతి నిమిషం మేధోమధనం జరగాలి. అన్వేషణలో కాలానికే కొత్త అనుభవం నేర్పాలి. 

తక్కువ ధరకు, నాణ్యమైన మందులు తయారు చేయాలి.పేదలకు అందుబాటు ధరల్లో ఆరోగ్యం బాగు చేసుకోగలగాలి. వైద్యం అంటే సామాన్యులు భయపడిపోకూడదు. తమకు జీవించే హక్కు వున్నట్లే, వారికి వైద్య సేవలు అందుకునే అవకాశాలు రావాలి. రోగం రావడం తమ ఖర్మమని బాధపడిపోకూడదు. వైద్యానికి భయపడిపోకూడదు. పేదరిక సమాజానికి భరోసా కల్పించడం అంటే మాటలు కాదు. వైద్య రంగంలో వ్యాపారం అంటే సామాన్యమైన విషయం కాదు. కాని సాధ్యం కాదనుకున్నది సాధ్యం చేసి చూపించాడు. పేదలు సైతం నయం కావనుకునే రోగాలకు సైతం మందులు తెచ్చి, చౌకగా చాలా రకాల మందులు అందుబాటులోకి తెచ్చారు. మార్కెట్‌ను ముంచెత్తారు. ప్రపంచ మార్కెట్‌ను దాసోహం చేసుకున్నారు. ఒక వ్యక్తి ఒక విజయం సాధిస్తేనే ఎంతో సంతోషం, ఆనందం, ఖ్యాతి వస్తాయి. అలాంటిది విజయాలకు లెక్కే లేకపోతే, వ్యాపారంలో తిరుగులేకపోతే , ఎదరులేకపోతే అది ఎలా వుంటుందో మాటల్లో చెప్పలేనిది. అక్షరాల్లో వర్ణించలేని అనుభూతది. అది అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.

బండి పార్ధసారధి రెడ్డిది ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కందుకూరు గ్రామం.కుటుంబ నేపధ్యం మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ప్రాధమిక విద్యాబోధన అంతా ఆ గ్రామంలోనే సాగింది. ఇంటర్‌, డిగ్రీ ఖమ్మంలో పూర్తయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. యాంటీ కాన్సర్‌ డ్రగ్స్‌పై పిహెచ్‌డి చేశారు. 

నాణ్యమైన ఔషదాలు తయారు చేయాలి.పేదలకు అందుబాటు ధరలో తేవాలి. ఇదే పార్ధసారధి రెడ్డి మరిన్ని బాటలు వేశాయి. అంతవరకు మందుల తయారీ గురించే తప్ప, సామాన్యులకు కూడా మందులు చౌకగా అందించాలన్న ఆలోచన ఎవరూ చేయలేదు. తన వద్ద వున్న రూ.45లక్షల పెట్టుబడితో తొలి అడుగువేశారు. బ్యాంకు నుంచి రూ.45లక్షలు అప్పు తీసుకున్నారు. మొత్తం రూ.90 లక్షలతో 1993లో హెటిరో డ్రగ్స్‌ను ప్రారంభించారు తొలి ఏడాదిలోనే రూ.1.3 కోట్లు లాభాన్ని ఆర్జించారు. అందులో రూ.30 లక్షలు ట్యాక్స్‌ చెల్లించారు. మొదట్లో సైక్రియాట్రిక్‌, కార్డియాట్రిక్‌ డ్రగ్స్‌ తయారీతో ప్రస్ధానం మొదలైంది. ఏ రెడ్డి ల్యాబ్‌ నుంచి పార్ధసారధి రెడ్డి ఉద్యోగ జీవనం ప్రారంభమైందో, అదే రెడ్టీస్‌ ల్యాబ్‌కు హైపటైటిస్‌ `సి డ్రగ్‌ మార్కెటింగ్‌ లైసెన్స్‌ ఇచ్చే స్ధాయికి హెటిరో ఎదిగింది. అంటే దాని వెనక పార్ధసారధి రెడ్డి పడిన కఠోర శ్రమ ఎంతటిదో అర్ధమౌతుంది. 

బర్డ్‌ ప్లూ, స్వైన్‌ఫ్లూలకు మందులు తయారిలో దిగ్గజం.ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్‌ లీడర్‌ అని చెప్పుకోవచ్చు. ఇక 1997లోనే ఎయిడ్స్‌కు మందు తయారు చేసి సంచనలం సృష్టించారు. హెచ్‌ఐవి వైరస్‌ను ఎదుర్కొవడానికి అవసరమైన మందులు తయారు చేయడం అప్పట్లో పెద్ద విజయం. అయితే పూర్తిగా ఎయిడ్స్‌ను రూపు మాపే ఔషదాల సృష్టి జరలేదు. కాకపోతే ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కోసం వాడే మందులు అప్పట్లో అత్యంత ఖరీదైనవి. అవి పేదలకు సైతం అందుబాటులో వచ్చే విధంగా మందులు తయారుచేయడమే కాకుండా, ప్రపంచ దేశాలలో కొన్ని కోట్ల మందికి ఆ మందుల ద్వార ప్రాణాలు నిలపడం అన్నది పెద్ద విజయం. హెటిరో స్ధాపించిన 15 సంవత్సరాలలో వంద రకాల డ్రగ్స్‌ను తయారు చేసి, మార్కెట్‌ను ఆశ్చర్యపర్చారు. హెటిరో స్ధాపించి వచ్చేఏడాది ముప్పై సంవత్సరాలు కానుంది. ప్రస్తుతం 300 రకాల మందులు మార్కెట్‌లో అందుబాటులో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 138 దేశాల్లో హెటిరో డ్రగ్స్‌ వినియోగంలో వున్నాయి. 

సుమారు 13 సంవత్సరాల పాటు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అధినేత అంజిరెడ్డికి చేదోడు వాదోడుగా వుంటూ,తనకంటూ ఒక ప్రత్యేకతను సంచరించుకునేందుకు 1993లో హెటిరో ఏర్పాటు చేశారు. కేవలం తన వద్ద వున్న రూ. 45లక్షలు, బ్యాంకు నుంచి రూ.45 లక్షలు అప్పు తీసుకొని మొత్తం రూ.90 లక్షలతో హెటిరో ప్రారంభించారు. తొలి ఏడాదే రూ.1.90 కోట్లు లాభం చూశారు. అందులో రూ.30 లక్షల ట్యాక్స్‌లు చెల్లించారు. ఇలా మొదలైన హెటిరో అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఎత్తు పల్లాలు కూడా చవి చూసింది. అయినా ఎక్కడా పార్ధ సారధి రెడ్డి తగ్గలేదు. ఎదుర్కొన్నాడు. నిలబడ్డాడు. తన ధైర్యాన్నంత కూడ దీసుకొని ముందుకు సాగాడు. తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తం చేశాడు. సుమారు 138 దేశాలలో తన మందులకు మార్కెట్‌ చేశాడు. 

బర్డ్‌ ఫ్లూ అన్నది ఒక ఒకప్పుడు పక్షిజాతి అంతం చేస్తుందా? అన్నంత దాక వెళ్లింది. ఫౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేసింది. కాని అతి వేగంగా ఎవరికీ సాధ్యం కాని బర్డ్‌ ప్లూ డ్రగ్‌ను ఆవిష్కరించారు. అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు. తర్వాత స్వైన్‌ ప్లూ అన్నది ఎంతగా విస్తరించి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది. దానికి కూడా ఎంతో వేగంగా డ్రగ్‌ను సృష్టించారు. స్వైన్‌ఫ్లూన్‌ పారద్రోలారు. ఇక కొన్ని దశాబ్ధాలుగా మానవాళిని కబలిస్తున్న ఎయిడ్స్‌ కూడా అతి చౌకగా మందులను తయారు చేసి, ప్రపంచ దేశాలకు సరఫరా చేశారు. వాటి వినియోగంతో సగటు ఆయు ప్రమాణం పెరిగేలా చేశారు. తక్కువ ఖరీదులో అతి భయంకరమైన ఎయిడ్స్‌ నుంచి ఉపశమనం చూపించారు. ఇక తాజాగా కరోనా వైద్యంలో అతి కీలకమైన రెమిడిస్‌ వీర్‌ అన్నది దానిని అందుబాటులోకి తెచ్చి, ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఇదే కాకుండా తాను ఏ రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచి వచ్చారో, అదే రెడ్డీస్‌ ల్యాబ్‌కు హైపటైటిస్‌` సి. అనే డ్రగ్‌కు మార్కెటింగ్‌ లైసెన్స్‌ ఇచ్చి సంచలనం సృష్టించారు. 

అమెరికానే మనకు ఉద్యోగాలు ఇస్తుందా? మనమెందుకు అమెరికన్లకు ఉపాధి కల్పించొచ్చు. అని ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. అక్కడ ప్రభుత్వం నుంచి భూమిని సేకరించి ఇవ్వమని అడగలేదు. మొత్తం అక్కడ తన ఇండస్ట్రీకి అవసరమైన భూమిని సొంతంగా కొనుగోలు చేశాడు. కంపనీ స్టార్ట్‌ చేశాడు. సగం మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాడు. మిగతా సగం ఉద్యోగాలు మన తెలుగు వారికి అవకాశం కల్పించారు. ఇలా ఆయన ప్రపంచ దేశాలెన్నింటిలోనూ ఫార్మా రంగంలో విజయ కేతనం ఎగురవేశారు…ఫార్మా దిగ్గజం అంటే పార్ధసారధి అని నిరూపించుకున్నారు. తెలుగు నాట రెడ్డీస్‌ తర్వాత స్ధానం లో సాగుతున్నారు. ఆ స్ధానం పదిలం చేసుకున్నారు. అలాంటి పార్ధ సారధి రెడ్డి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ…ఆల్‌ ది బెస్ట్‌…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*