ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు
వరంగల్ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు సంబందించిన నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను ఉమాబుక్ స్టాల్ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల నగరంలోని దేశాయిపేట రోడ్‌లో నిర్వహిస్తున్న ఉమా బుక్‌స్టాల్‌పై సొమవారం తూనికలు, కొలతల అధికారలు దాడులు నిర్వహించి బుక్‌స్టాల్ నిర్వాహకులు అమ్ముతున్న నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. వాటిపై ఉన్న రేట్లను క్షణ్ణంగా పరిశీలించారు. ఎమార్పి రేట్ల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తూనికల, కొలతల అధికారలు హెచ్చరించారు. నగరంలో ప్రైవేటు పాఠశాలలు కొన్ని బుక్‌స్టాల్ వారితో కుమ్మక్కయి అక్రమ దందా నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నారని అధిక ధరలకు పుస్లకాలను అమ్ముతున్నారని, కొన్నింటిపైనా ఎమ్మార్పి రేటు లేకుండానే నిర్వాహకులు ఎంత చెబితే అంత ఇచ్చి కొనాల్సిందేనని, పుస్తకాల భారం మోయలేకుండా ఉన్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి ఫిర్యాదు మేరకు సొమవారం చేపట్టిన తనిఖీల్లో ఎమ్మార్పి లేకుండా విక్రయిస్తున్న పుస్తకాలు, నోట్‌బుక్‌లు కొన్ని లభ్యమయినట్లు తెలుస్తున్నది. ఈ దాడులు నగరమంతా నిర్వహించి ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మినా, ప్రైవేటు పాఠశాలలతో కుమ్మక్కై వ్యాపారం నిర్వహించినా కఠిచర్యలు తీసుకుంటామని, మరో రెండురోజుల పాటు ఈ దాడులు నిర్వహిస్తామని అధికారలు తెలిపారు.