ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు అవినీతి తాటిచెట్టులా పెరిగిపోతూనే ఉన్నది. అవినీతి నిరోధక శాఖ ఎంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపినా, అవినీతిపరుల్లో మాత్రం ఎలాంటి భయం ఉండటంలేదు. ఇంతకుముందు కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడేవారు. కాని ఈ మద్యకాలంలో అధికారితోపాటు కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేసేందుకు ఉవ్విళ్లూరుతూ దర్జాగా కార్యాలయాల్లో తిష్ఠవేసి అడ్డగోలుగా నొక్కేస్తున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయం ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో జరిగింది. కార్యాలయ అధికారి తమ ఇద్దరు కూతుళ్లు కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేసినట్టుగా పేర్లు అదనంగా చేర్చి అక్రమంగా బిల్లులను తయారుచేసి క్యాంపు డబ్బులను తమ వ్యక్తిగత ఖాతాలోకి జమచేసుకున్నారు.

‘ఛీ’కొడుతున్న స్థానిక నిరుద్యోగులు

ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో దినసరి కూళీలుగా భాయ్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించుకొని వారితో పనిచేయించి పనికి గుర్తింపుగా రోజువారి వేతనంగా ఎన్నిరోజులు పనిచేస్తే అన్నిరోజులకు డబ్బులు కట్టించి చెలించారు. ఇందులో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేయకున్నా పనిచేసినట్టు ఓ అధికారి తమ ఇద్దరు కూతుళ్ల పేర్లను పెట్టి రూ.30వేల రూపాయాలను నొక్కేశాడని పలువురు విమర్శిస్తున్నారు. పైగా ఆ ఇద్దరు అమ్మాయిలు కరీంనగర్‌కు చెందినవారని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో స్థానిక నిరుద్యోగులు హన్మకొండలో కంప్యూటర్‌ పరిజ్ఞానం తెలిసినవారే లేరన్నట్టు అక్కడి నుండి వచ్చారా? ఎందుకు లేనివి ఉన్నట్టు రాసి ప్రభుత్వ సొమ్మును నొక్కేయడం అని కొందరంటుండగా, మరికొందరు క్యాంపుకే పెద్ద అదికారి అయిన ఆయన తమ కూతుళ్ల పేర్లను పెట్టుకోవడిన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *