
మోత మోగించే ఆటోలపై కొరడా జులిపిస్తున్న ఎస్ఐ రాజ్ కుమార్
ఆటోలో డీజే బాక్సులు పెట్టి చేక్కర్లు కొడితే ఆటో డ్రైవర్ల చుక్కలు చూడడం కాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాచలం.బూర్గంపాడు మండలం లో ఉన్నటువంటి ఆటోలను తనిఖీ చేస్తున్న బూర్గంపాడు పోలీస్ అధికారులు… ప్రజలకు ఇబ్బందికరంగా ఆటోలో సౌండ్ బాక్స్ లు పెట్టి విపరీతమైన సౌండ్ తో ఆటోలను మండలంలో తిప్పినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై రాజ్ కుమార్ ఆటో డ్రైవర్లకు సూచనలు చేశారు పోలీస్ ఆదేశాలను ధిక్కరించి ఆటోలో డీజే బాక్స్‌లు పెట్టినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అదేవిధంగా ఆటోలో పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణికులు ప్రమాద బారిన పడేలా ఆటోలను నడిపినట్లయితే ఇకపై సహించేది లేదంటూ ఆటో డ్రైవర్లకు సూచనలు చేశారు ఆటోలను ప్రధాన సెంటర్లో ఎక్కడపడితే అక్కడ ఆపి ప్రయాణికులకు వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది కలిగించినట్లయితే చర్యలు తప్పవని తెలియజేశారు ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ ఖాకీ చొక్కా ధరించి ఉండాలని ఆటో నడిపే ప్రతి డైవర్ లైసెన్స్ పొంది ఉండాలని లైసెన్స్ లేని డ్రైవర్లకు ఆటోలను ఆటో ఓనర్లు ఇవ్వవద్దని ఒకవేళ ఇచ్చినట్లయితే వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసిన బూర్గంపాడు ఎస్సై రాజ్‌కుమార్