ధరణిపై అసత్య ప్రచారాలు చేస్తున్నది వాళ్లే?

https://epaper.netidhatri.com/

`రికాం లేని రిజిస్ట్రార్ల ఆమ్ధాని పేరు తో నేటిధాత్రి వరుస కధనాలు?

`ఆ వివరాలు సేకరిస్తున్న సమయంలో వెలుగు చూసిన ఈ నిజాలు?

`ధరణిపై అసత్య ప్రచారాలు చేస్తున్నది వాళ్లే?

`ధరణిని దగా చేస్తోంది ఇంటి దొంగలే!?

`రిజిస్ట్రేషన్‌ విషయంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నది ఆ కొందరే?

`ప్రజలు మీడియాకెక్కేలా చేసి, ధరణిపై విష ప్రచారం చేస్తోంది వీళ్లే?

`రేవంత్‌ డైరెక్షన్‌…కొందరు రిజిస్ట్రార్ల యాక్షన్‌!?

`గత తొమ్మిది నెలలుగా పాతిక మంది రిజిస్ట్రార్లు పని గట్టుకొని చేస్తున్న పని?

` ఓ మహిళా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది?

` ఆ ఎమ్మెల్యేకు కొందరు అధికార పార్టీ నేతల అండదండలు?

`ధరణిని రూపకల్పనలో భాగమైన ఓ ఉన్నతోద్యోగి మీద అసత్య ప్రచారం?

`ధరణిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లంతా రేవంత్‌ వర్గం?

`ఓ రెండు జిల్లాలో రేవంత్‌ బంధువులు సాగిస్తున్న దుష్ప్రచారం!

`రేవంత్‌ సామాజిక వర్గానికి చెందిన కొందరు పని గట్టుకొని సాగిస్తున్న వ్యవహారం?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి విషయంలో ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయడానికి కొందరు పనిగట్టుకొని దుష్పప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతోద్యోగుల, కొందరు రిజిస్ట్రార్లు కలిసి ఈ కుట్రకు తెరలేపినట్లు విశ్వసనీయ సమచారం. ఇదంతా కేవలం కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్లంతా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఓ సామాజిక వర్గానికి చెందినకొందరు అధికారులు పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ రెండు ఉమ్మడి జిల్లాలలో ఇది ఎక్కువగా సాగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఓ 25 మంది ఈ కుట్రకు తెరలేపినట్లు చెప్పుకుంటున్నారు. ధరణిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేందుకు గత ఏడాది కాలంగా వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ మహిళా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులగా మెలిగే రిజిస్ట్రార్‌ మొదట ఈ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె పని చేసే చోటు నుంచి ట్రాన్స్‌ఫర్‌ అయినా, కొత్త ప్లేస్‌లో జాయిన్‌ అయిన రోజే లాంగ్‌ లీవ్‌ పెట్టి వెళ్లారట. ఆ ఎమ్మెల్యేకు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల మద్దతు కూడా వున్నట్లు సమాచారం. వారి అండదండలతోనే ఆ ఎమ్మెల్యే ధరణిలో లోపాలపై పెద్దఎత్తున ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాలను ఆసరా చేసుకొని పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పదే పదే ధరణిని ఎత్తేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాడు. అక్కడక్కడ ఎదురౌతున్న లోపాలు కూడా సంబంధిత రిజిస్ట్రార్లు సృషించినవే అంటున్నారు. ధరణి తీసుకొచ్చే ముందు ముఖ్యమంత్రి కేసిఆర్‌ రిజిస్ట్రేషన్లశాఖలో జరిగే అవతవకలపై అసెంబ్లీలో సుదీర్ఘంగా వివరించారు. దాంతో రిజిస్ట్రేషన్‌ శాఖను భవిష్యత్తులో తీసేసే అవకాశం వుందంటూ కూడా ఓ వర్గం తీవ్రంగా ప్రచారం చేస్తోంది. దాంతో ఆ శాఖ ఉద్యోగులు డైలమాలో వున్నారు. ఇక ఇదిలా వుంటే ధరణిని ధగా చేస్తున్న కొందరు రిజిస్ట్రార్లు కావలనే కొంత మందిని పదే పదే తిప్పించుకుంటున్నారు. దాంతో ప్రజలకు విసుగు వస్తుంది. కోపం కూడా వస్తుంది. ఎన్ని రోజులు తిరగాలన్నదానిపై అధికారులను ప్రజలు నిలదీయడం. ప్రభుత్వాన్ని తూర్పార పట్టే దాకా లాగుతున్నారు. ఆపై కొంత మంది యూట్యూబ్‌ ఛానళ్లను బాదితుల వద్దకు పంపించి ప్రభుత్వం మీద విమర్శలు చేయిస్తున్నారు. ఇదీ కొందరు రిజిస్ట్రార్లు చేస్తున్న పని. ఇన్ని అవాంతరాలంటూ, అన్ని ఇబ్బందులంటూ వార్తలు వస్తున్నా, తిరిగి పనులన్నీ దరణితో సజావుగానే సాగుతున్నాయి. ఈ ఇబ్బందులు కూడా అన్ని జిల్లాల్లో రావడంలేదు. కేవలం సృష్టించబడుతున్న జిల్లాల్లోనే వస్తున్నాయి. వాళ్లు కూడా పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీకి సహకరించే విధంగా చేస్తున్న దుర్మార్గమే ప్రజల్లో ధరణిపై చెడు ప్రచారం జరుగుతోంది. 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎక్కడికెళ్లినా, సభలు, సమావేశాలలో ధరణి వుంచాలా? వద్దా? అంటూ అడుగుతుంటే ఎక్కడా ప్రజలు వద్దని అనడం లేదు. 

కాని కేవలం ప్రతిపక్షాలకు చెందని వాళ్లు మాత్రమే దీన్ని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మడం లేదు. కాని సోషల్‌ మీడయాలో మాత్రం దాని విసృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం లేదు. ప్రాజెక్టుల గురించి ఎన్ని మాట్లాడినా నీళ్లు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మడం లేదని అర్ధమౌతోంది. ఇటీవలే పాలమూరురంగారెడ్డి పూర్తి చేసి, దక్షిణ తెలంగాణకు నీళ్లు అందించారు. కొన్ని దశాబ్దాలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడని పనులు, తెలంగాణ తెచ్చి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పూర్తి చేస్తున్నారు. ఎడారి లాంటిపాలమూరు కూడా పచ్చని కోనసీమను తలపించేలా మార్చివేశారు. ప్రభుత్వం మీద నీటి గురించి ప్రతిపక్షాలు మాట్లాడినా ప్రజలు హర్షించేలా లేరు. ఇక కరంటు విషయంలోనూ అదే పరిస్ధితి. ఇటీవలే కరంటుపై రేవంత్‌రెడ్డిచేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం తెచ్చిపెట్టాయి. గతంలో కరంటు ఎప్పుడు వస్తుందో తెలియని కాలం నుంచి, నేడు ఎప్పుడు పోతుందో కూడా తెలియనంతగా కరంటు వస్తోంది. అటు సాగుకు, ఇటు ఇళ్లకు నిరంతరం విద్యుత్‌ అందుతోంది. తెలంగాణ సంపన్నరాష్ట్రంగా అవతరించింది. దాన్ని కూడా తప్పుపడితే ఇక తాము ప్రజలకు హామీలు ఇవ్వలేమని కాంగ్రెస్‌ నాయకులు తెలుసుకున్నారు. ఇక వాళ్లకు ఏకైక అస్త్రంగా మారింది ఒక్క ధరణి మాత్రమే. అందుకే ధరణి విషయాన్ని పదే పదే ముందుకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. 

 ఎప్పుడో నిజాం కాలంలో రూపకల్పన చేసిన భూముల సర్వేలు, లెక్కలు మళ్లీ తెలంగాణ వచ్చిన తర్వాతే చేయడం జరిగింది.

 అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ద పెట్టి, భూ యజమానికి తెలియకుండా, వారి సంతకం లేకుండా ఇంచు భూమి కూడా ఇతరుల పరమయ్యే అవకాశం లేకుండా ధరణి తెచ్చారు. ఇది కొందరికి గిట్టడం లేదు. అయితే ఒకపెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశం వుంటుంది. వాటిని కూడా ప్రభుత్వం సరిచేస్తూనేవుంది. చిన్న చిన్న లోపాలను పట్టుకొని కొంత, ఉద్యోగులు సృష్టిస్తున్న కృత్రిక సమస్యలతో ధరణి మీదే పెద్దఎత్తున విష ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. నేటిధాత్రి గత కొంత కాలంగా రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్ధాని అనే శీర్షికతో ఎక్కడెక్కడ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలు ప్రచురిస్తోంది. ఆ వివరాల సేకరణలో వున్న నేటిధాత్రికి ధరణి విషయంలో జరుగుతున్న కుట్ర గురించి తెలిసింది. ఓవైపు కొంత మంది రిజిస్ట్రార్లు ఎంత అవినీతికి పాల్పడాలో పాల్పడుతూనే, మరో వైపు ధరణిని తప్పుడు ప్రచారాన్ని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారన్నది తెలిసింది. 

 తెలంగాణ ఉద్యమ కారుడైన రిజిస్ట్రేషన్ల శాఖలో ఓ ఉన్నతోద్యోగి ధరణి రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఆయన ధరణి వల్ల ఎన్ని ఉపయోగాలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి, ప్రజలకు ఎంత మేలు చేసిందో కూడా పెద్దఎత్తున ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి నాయకుడు ధరణి గురించి మంచిగా ప్రచారం చేయడం నచ్చని కొంత మంది ఉద్యోగులు ఆయనపై కూడా తప్పుడు ప్రచారానికి దిగి, ఆయనను అబాసు పాలు చేశారు. ఇలా ధరణి గురించి పూర్తిగా అవగాహన వున్న ఆ ఉద్యోగిని ప్రభుత్వపెద్దలకు దూరం చేయడంతో చెప్పేవారు లేకపోతున్నారు. దరణినిపై ఓవైపు దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులే, ఆ ఉద్యోగి మీద ప్రభుత్వ పెద్దలకులేనపోనివి చెప్పి నమ్మించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ఉన్నతోద్యోగి మాట్లాడుతున్నాడంటూ లేనిపోనివి చెప్పి, ప్రభుత్వ పెద్దలకు దూరం చేశారు. ఇప్పుడు ధరణిలో కొందరు రిజిస్ట్రార్లు సాగిస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే వాళ్లు లేకుండాచేశారు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ నుంచి అందుతున్న ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని వెంటనే గుర్తిస్తే, అసలు కుట్రదారులు బైటకొస్తారు. లేకుంటే ప్రభుత్వంపై వాళ్లు ఇలా విష ప్రచారం సాగిస్తూనే వుంటారు. అంతే కాకుండా దరణి విష ప్రచారం వెనక గూడుపుఠాని చేస్తున్నవారికి అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలే సహకరిస్తున్నారన్న వార్తలు కూడా వున్నాయి. గతంలో వారికి సహకరించిన రుణం ఈ రకంగా ఆ నాయకులు తీర్చుకుంటున్నారు, ప్రభుత్వానికి , బిఆర్‌ఎస్‌కు తీరన నష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *