అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి

అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలి. వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపుకు సంబందించిన డబ్బులను పనిచేయనివారికి పనిచేసినట్టుగా, రెగ్యులర్‌ ఉద్యోగలను క్యాంపులో భాయ్స్‌గా పనిచేసినట్టుగా తప్పుడు లెక్కలు రాసి వారి అకౌంట్లలో వేశారని, వీరిద్దరే కాకుండా బయట వారి అకౌంట్లను సేకరించి దొంగ పేర్లను రాసి అక్రమంగా చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేసుకున్న అవినీతి ఉద్యోగులను గుర్తించి వారిని సస్పెండ్‌ చేయాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూరం రనీల్‌, రాజులు ఫ్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీసీ కెమెరాలు ఎందుకు బంద్‌ చేశారో చెప్పాలి

డిఐఈవో కార్యాలయంలో ఏప్రిల్‌ నుండి మే వరకు కార్యాలయంలో ఎందుకు సీసీ కెమెరాలు బంద్‌ చేశారో డిఐఈవో ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక వైపు సీసీ కెమెరాలను ప్రతి చోటా అమర్చుకోవాలని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, పోలాస్‌యంత్రాంగం చెబుతుంటే డిఐఈవో కార్యాలయంలో మాత్రం ఉన్న కెమెరాలను ఎందుకు బంద్‌ చేయాల్పి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం జిల్లా కమిటి డిఐఈవోను డిమాండ్‌ చేశారు. ప్రతి ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కళాశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పే డిఐఈవో తాను తన కార్యాలయంలో ఎందుకు బంద్‌ చేయాల్సి వచ్చిందో అంతుచిక్కడం లేదని, పలు అనుమానాలకు తావునిస్తున్నదని వారు ఈ సందర్బంగా అన్నారు.

రాత్రి వేళలో ఆఫీస్‌లో ఉంటున్నదెవరు…?

ఇంటర్మీడియట్‌ ఆర్బన్‌ ప్రదానకార్యాలయంలో గత నాలుగు నెలల నుండి ఓ వ్యక్తి రాత్రి వేళలో కార్యాలయంలోనే ఉంటున్నాడని, అక్కడే నిద్రిస్తున్నాడని అతను నైట్‌వాచ్‌మెనా…? అపరిచిత వ్యక్తి ఏమైనా ఉంటున్నాడా…? అని అర్ధం కావడంలేదని రనీల్‌, రాజులు అంటున్నారు. ఆయన అధికారిక నైట్‌వాచ్‌మెనా…? ప్రైవేటు నైట్‌వాచ్‌మెనా? తెలియకుండా ఉన్నదని, అతను ఎవరో అధికారులే వెల్లడించాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *