అర్హులను నెట్టి…అనర్హులకు పెట్టి!?

`అధికారుల సహకారం…ట్రేడర్ల మాయాజాలం

`లబ్ధి దారులకు సెంట్రింగ్‌ ఇచ్చే వారు వద్దా? 

` రెండు లక్షలు తీసుకునే వారే ముద్దా!

`దళితుల సొమ్ము కాజేసేవారికే కొమ్ము కాస్తారా?

` సెంట్రింగ్‌ సరఫరా చేస్తామనే వారికి బెదిరింపులా?

`మా ఊరికొస్తే అట్రాసిటీ కేసు పెడతామని భయపెట్టిస్తారా?

` నిజాయితీగా లబ్ధి దారులకు మేలు చేస్తామంటే వద్దంటారా?

` కేకే…స్టీల్‌ ట్రేడర్‌ ను ఎందుకు కాదన్నారు?

` తాను సరఫరా చేసిన సెంట్రింగ్‌ కు కూడా పని కల్పిస్తామని చెప్పే వారు వద్దా?

` నిష్పక్షపాతంగా సెంట్రింగ్‌ సరఫరా చేసే వారికి ప్రోత్సాహం లేదా?

` కనీసం అప్పటికప్పుడు లైసెన్స్‌ సృష్టించుకున్న వారికి అందలమా?

`దళితుల బలహీనతతో ఆడుకుంటారా?

`రెండు లక్షలు నొక్కి, తోచింది చేతిలో పెట్టి, దళిత బంధు లక్ష్యం నీరుగార్చుతారా?

`యూనిట్‌ ఇవ్వకుండా, డబ్బులిస్తామని చెప్పడం నేరం కాదా?

`దళితులను మోసం చేయడమే అధికారుల లక్ష్యమా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక చారిత్రక నిర్ణయంలో, సమాజ నిర్మాణంలో అందరికీ అవకాశం రాదు. భాగస్వామ్యం కాలేరు. దళితబంధు లాంటి విప్లవాత్మకమైన పథకం అమలులో అన్ని వర్గాల ఉద్యోగుల అవసరం లేదు. కాని తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెచ్చిన దళిత బంధు పధకం అమలుకు కొన్ని శాఖలు, కొంత మంది అధికారులకే అవకాశం వచ్చింది. ఆ పధకం అమలులో భాగస్వామ్యమైన దళితులకు అందాల్సిన రూపాయి పక్కదారి పట్టకుండా చూడాల్సిన అధికారులు చేసిన నిర్వాకం మూలంగా వారే విమర్శల పాలౌతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో వారు చేసిన, దారి చూపిన అవినీతిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందిస్తోంది. ఏ క్షణమైనా దీనిపై విచారణ జరిగే అవకాశం కూడా వుంది. అధికారులు, అధికారులకు కొమ్ము కాసిన ట్రేడర్ల మూలంగా హుజూరాబాద్‌ లో అమలు చేయస్తున్న దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. అర్హులనై ట్రేడర్లను పక్కనకు నెట్టేశారు. అనర్హులైన ట్రేడర్లకు అవకాశాకాలు కల్పించారు. దాంతో దళితులకు అందాల్సిన న్యాయమైన సొమ్ము ఉత్తుత్తి ట్రేడర్లు, అధికారుల జేబుల్లోకి వెళ్లిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

 దళిత బంధు అమలులో ప్రభుత్వం అవకాశం కల్పించిన ట్రేడర్లలో సెంట్రింగ్‌ యూనిట్‌ అందించే ప్రత్యేక పరిశ్రమ వున్న సంస్ధ కేకే. స్టీల్‌. పూర్తి స్దాయిలో అన్ని రకాల అనుమతులు వున్న సంస్ధ. 

దళిత బంధు అమలులో భాగంగా అందించే సెంట్రింగ్‌ యూనిట్‌ను అందిస్తున్న విశ్వసనీయ సంస్ధల్లో ఇదొకటి. సహజంగా సెంట్రింగ్‌ యూనిట్లు అందిస్తున్న ఇతర సంస్ధలు కేవలం 1500 ఎస్‌ఎఫ్‌టిమాత్రమే అందిస్తున్నాయి. కాని కేకే అనే సంస్ధ 2000 ఎస్‌ఎఫ్‌టి అందిందించేందుకు ముందుకొచ్చింది. దళితులకు మేలు చేసే ఇలాంటి గొప్ప పధకంలో భాగాస్వామ్యం కావాలన్నదే ఈ సంస్ధ లక్ష్యం. అంతే కాదు మిగతా సంస్దలకన్నా తక్కువ ధరకే కోడ్‌ చేస్తామని కూడా చెబుతున్నారు. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమల గిరిలో ఈ సంస్ధ అందించిన యూనిట్లు ఇప్పుడు దళితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ కేకే అనే సంస్ధ సెంట్రింగ్‌ యూనిట్‌ను అందించడమే కాకుండా, ఆ యూనిట్‌ తీసుకున్న దళితులకు ఆ యూనిట్‌ ద్వారా ఆదాయం సమకూర్చే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా చెబుతున్నారు. కాని ఇది అధికారుల చెవికెక్కలేదు. నిజానికి ఆ పని అధికారులు చేయాలి. సెంట్రింగ్‌ యూనిట్‌ అప్లికేషన్‌ పెట్టుకున్న దళితులకు ఖచ్చితంగా ఆ యూనిట్‌ అందజేయాల్సిన బాధ్యత అధికారులది. అంతే కాకుండా ఆ యూనిట్‌ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత అధికారులదే.

ఇది ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో ఖచ్చితంగా పాటించాల్సిన అంశం. ఇక్కడ అధికారులు పాటించాల్సిన అంశాన్ని సెంట్రిగ్‌ యూనిట్‌ అందిస్తామని చెప్పిన కేకే స్టీల్‌ ట్రేడర్‌ , లబ్ధిదారులందరికీ తామే ఉపాధి కల్పిస్తామని అందుకు అవసరమైన బాండ్‌ కూడా రాసిస్తామని చెబుతున్నారు. కాని అదికారులు వినలేదు. ససేమిరా అన్నారు. కారణం ఈ కేకే స్టీల్‌ ట్రేడర్స్‌ లబ్ధిదారులకు నేరుగా డబ్బులు ఇస్తామని చెప్పకపోవడమే కారణం….! అసలు ట్రేడర్లు చేయాల్సిన పనేమిటి? అధికారుల పర్యవేక్షణ ఏమిటి? అన్నది అందరికీ తెలియాల్సిన అవసరం వుంది. ఖచ్చితంగా ట్రేడర్లు లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్లే అందించాలి. కాని దళితుల అకౌంట్లో వున్న డబ్బును సుమరు 2 లక్షలు తీసుకొని మిగతా సొమ్ము ఇవ్వడానికి కాదు…ఇలా ప్రజా ధనం పక్క దారి పట్టేందుకు కాదు…కాని అధికారులు, కొంత మంది ట్రేడర్లు కలిసి ఆడుతున్న నాటకంలో అసలైన ట్రేడర్లు పక్కకు వెళ్తున్నారు. లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. వారి సొమ్మును నొక్కేస్తున్నారు. 

 లబ్ధిదారులకు యూనిట్లు అందిస్తామే తప్ప డబ్బుల మాయాజాలంలో మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని చెబుతున్న కేకే స్టీట్‌ ట్రేడర్‌ సంస్ధ వ్యక్తులను కొందరు వ్యక్తులు బెదిరిచినట్లు సమాచారం.

 యూనిట్లు ఇస్తామంటూ నియోజకవర్గంలోకి వస్తే, అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని కూడా కొందరు నాయకులు బెదిరించారట. అసలు ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్న ట్రేడర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించడం ఏమిటి? అంతే కాదు లబ్ధిదారుల డబ్బులు పట్టుకొని ట్రేడర్‌ మాయమైతే అప్పుడు ఎవరి బాధ్యత అంటూ అమాయకులైన లబ్ధిదారులకు లేని పోని భయాలు కూడా కొందరు సృష్టించారని తెలిసింది. యూనిట్లు అందిజేసిన తర్వాతే లబ్ధిదారులనుంచి అందుకు అవసరమైన సొమ్మును డ్రా చేయించుకోవాలి…అదే కేకే.స్టీల్‌ చేస్తామని చెప్పింది. అయినా అధికారులు వినలేదు…నాయకులు వినలేదు…… పైగా ప్రజలను కొందరు నియోజకరవర్గ నాయకులు, బోగస్‌ ట్రేడర్ల్‌ దళితులను తప్పుదోవ పట్టించి, కేకే ట్రేడర్స్‌ను రాకుండా చేశారు. హుజూరాబాద్‌ నియోజవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు అందించాల్సినంత సెంట్రింగ్‌ దరఖాస్తు చేసుకున్న చాలా మంది ట్రేడర్లకు ఎలాంటి అర్హత లేదు. వారికి కంపనీలే లేవు. అవన్నీ కేవలం సూట్‌ కేస్‌ కంపనీలు. రాత్రికిరాత్రి పుట్టుకొచ్చిన లైసెన్సులు మాత్రమే . అవసరమైన గోడౌన్లు లేవు. ఆ సదుపాయాలు కూడా లేవు. మెటీరియల్‌ అంతకాన్న లేదు. కేవలం కాగితాల మీద లైసెన్సు తప్ప మరేం లేవు…కాని కేకే.స్టీల్‌ ట్రేడర్స్‌ అవసరమైన గోడౌన్లు వున్నాయి. దళితులకు అందజేయాల్సిన సెంట్రింగ్‌కూడా రెడీగా వుంది. అధికారులు కూడా ఆ గోడౌన్లు పరిశీలించారు. నామ్‌కే వాస్తే చూశామన్నట్లు చెప్పి, ఉత్తుత్తి ట్రేడర్లకు లాభాల పంట పండిరచేందుకు, వాటలు పొందేందుకే అధికారులు మొగ్గు చూపారు. కేకే స్టీల్‌ ట్రేడర్స్‌కు అవకాశం కల్పించలేదు. అధికారుల తప్పుడు నిర్ణయం వల్ల లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడు యూనిట్లు అందజేసేంత మెటీరియల్‌వున్న కేకే సంస్ధను కాదన్నారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తును పక్కన పెట్టేశారు. ఉత్తుత్తి ట్రేటర్లకు అవకాశం కల్పించారు. నేటిధాత్రి ఈ విషయంలో దరఖాస్తు చేసుకున్న ట్రేడర్లు, వారి వివరాలు సేకరించింది. వారికి సంబంధించిన లైసెన్స్‌ల ప్రక్రియను కూడా పరిశీలించింది. ఉత్తుత్తి ట్రేడర్ల నిర్వాకంపై నేటిధాత్రి పూర్తి స్దాయి దృష్టిపెట్టింది. వాటి బండారం బైటపెట్టనుంది. త్వరలో వారి బోగోతాలు వరుసగా మీ నేటిధాత్రిలో రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *