అభివృద్ధి పథంలో నడిపిద్ధాం – – పిఆర్‌ మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై హన్మకొండ అంబేడ్కర్‌భవన్‌లో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ జిల్లా ప్రతి అంశంలో అభివద్ధి కావాలని అన్నారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని అధికారులకు సూచించారు. హరితహారంలో అనుకున్న విదంగా విజయవంతం కాలేదని, ప్రజలు కోరుకునే చెట్లు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని, దేశంలోనే హరితహారానికి గొప్ప పేరు రావాలని తెలిపారు. పట్టాదారు పాస్‌ బుక్‌లు 80శాతం ఇచ్చారని, చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని, పోడు భూముల సమస్యలను తీర్చాలని, ఈ విషయంలో అధికారులు చాకచక్యంగా వ్యవహరించాలని అన్నారు. ఆరు జిల్లాలోని అన్నీ గ్రామాలు ఒడిఎఫ్‌ గ్రామాలు అయ్యేందుకు కషి చేయాలని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్నీ రకాలుగా సహకరిస్తుందని, అగ్రికల్చర్‌ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలను ఇవ్వాలని చెప్పారు. ఆసరా పెన్షన్‌లను జులై 1వ తేదీ నుండి పంపిణీ చేయనున్నామని అన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడాలని, బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివేలా చైతన్యం రావాలని తెలిపారు. మంజూరు అయిన రెండు పడక గదుల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదులకు భూమి సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని, దేశంలో ఎక్కడలేని విధంగా, ఎవరూ చేయలేని విధంగా అతి తక్కువ వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసిఆర్‌ పూర్తి చేశారని అన్నారు. దీని ద్వారా మొదట లాభపడేది వరంగల్‌ జిల్లానే అని తెలిపారు. ప్రతి అభివద్ధి కార్యక్రమానికి పక్కా ప్రణాళికను తయారు చేసుకోవాలని, ప్రతి మూడు నెలలకు రివ్యూ నిర్వహిస్తామని చెప్పారు. జులై 15లోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తవ్వాలని, ప్రతి ఇంటికి, పాఠశాలకు, హాస్టల్‌లకు భగీరథ నీరు అందాలని, మిషన్‌ భగీరథ పనులు పూర్తయినట్లు గ్రామసభలో సర్పంచ్‌ తీర్మాణించాలని, ఎమ్మెల్యేల పనులపై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలని, ప్రతి రోజు పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేలకు అందించాలని, రోడ్‌పై ఉన్న కుళాయిలను ఇంట్లో బిగించాలని, నీళ్లు వధా కాకూడదని, అలా చేస్తే గ్రామ పంచాయితీలకు ఫైన్‌ వేయాలని, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చట్టాలను తీసుకొచ్చారని, ఏ రాష్ట్రంలో కూడా మిషన్‌ భగీరథ కార్యక్రమం లేదని, దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

రాష్ట్రంలో ఏ మహిళ నెత్తిన బింద పెట్టుకొని నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లాలిసిన పరిస్థితి ఎదురుకాకూడదని, అధికారులు నిబద్దతతో పనిచేస్తున్నారని, ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చేశారని, రెసిడెన్షియల్‌, కెజిబివి మోడల్‌ స్కూల్‌కు ఉచితంగా కనెక్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కార్యక్రమం బహత్తర కార్యక్రమమని, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌, అధికారుల కషి వల్ల మిషన్‌ భగీరథ పనులు పరకాల నియోజకవర్గంలో త్వరగా పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొట్టమొదట చలివాగు ద్వారా భగీరథ నీరు 150అవసాలకు అందాయని, 110ఇళ్లకు ఇంటి పనులు పూర్తి అయ్యాయని, ఇంకా 30గ్రామాలకు సామాగ్రి అందాల్సి ఉందని, ఇఎన్‌సి వెంటనే మెటీరియల్‌ ఇవ్వవలిసిందిగా కోరుతున్నానని, జులై 30వరకు మిషన్‌ భగీరథ పనులు పూర్తవుతాయని, పైప్‌లైన్‌ వల్ల రోడ్డు డ్యామేజ్‌ అయితే వెంటనే సీసీ రోడ్‌ వేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. కుళాయిని బిగించినప్పుడు మాత్రమే మిషన్‌ భగీరథ పనులు అయినట్లుగా గుర్తించాలని తెలిపారు. పిదప నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనుల విషయంలో గతంలో నర్సంపేట నియోజక వర్గంలో ప్రత్యేక పరిస్థితి ఉండేదని, పని చేయడానికి అధికారులు సిద్దంగా ఉన్నా, కొందరు ఆ పనులకు అడ్డంకులు సష్టించేవారని, సంవత్సరం నుంచి పనుల వేగం పెరిగిందని చెప్పారు. 374 అవాసాలకు పనులు పూర్తి అయ్యాయని, పాలేరు నుండి నీరు రావడం వల్ల చిట్టా చివరి నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు నీటి ప్రెషర్‌ తగ్గిందని, ఈ మండలాలకు ప్రత్యామ్నాయం ఉంటే చూడాలని కోరుతున్నానని, ఇందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, 554కిలోమీటర్ల వరకు మాత్రమే పైప్‌లైన్‌ పనులు మంజూరయ్యాయని, 700కిలోమీటర్లకు పైప్‌లైన్‌ పనులు కావాలని అన్నారు. ప్రాజెక్టు పనులు నెమ్మదిగా మొదలైనప్పటికీ ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 280 ఒహెచ్‌ఎస్‌ఆర్‌ పనులు పూర్తయ్యాయని, 30 పనులు జరుగుతున్నాయని, వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నర్సంపేట మున్సిపాలిటీకి నీటి సరఫరా అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, నీటి సమస్యతో మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సత్యవతి రాథోడ్‌, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, ఆరూరి రమేష్‌, నన్నపునేని నరేందర్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్‌ టి.రాజయ్య, బి.శంకర్‌నాయక్‌, ఎం.యాదగిరిరెడ్డి, వి.సతీష్‌కుమార్‌, పిఆర్‌, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్‌ నీతు కుమారి ప్రసాద్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, హరిత, వినయ్‌కృష్ణారెడ్డి, డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, శివలింగయ్య, నారాయణరెడ్డి, పోలీస్‌ అధికారులు, మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌, సిఇలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *