అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాల సీజ్

అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలకు షోకాజ్ నోటిసులు పంపి,కళాశాలను సీజ్ చేసిన డి.ఐ.ఈ.ఒ

నేటి ధాత్రి* హన్మకొండ లోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం లో గల భవనం కిరాయికి తీసుకుని అక్రమంగా నారాయణ జూనియర్ కాలేజి పేరుతో నడిపిస్తున్నారు.ఈ కళాశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎబివిపి కార్యకర్తలు వరంగల్ జిల్లా డి.ఐ.ఈ.ఒ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ రోజు నారాయణ జూనియర్ కాలేజి యాజమాన్యం కి షోకాజ్ నోటిసులు జారి చేసారు. వరంగల్ అర్బన్ జిల్లా డి.ఈ.ఓ మరియు డి.ఐ.ఈ.ఓ ఆధ్వర్యంలో కళాశాల ను సీజ్ చేసారు.ఈ సందర్భంగా ఎబివిపి తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేణు మాట్లాడుతూ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎబివిపి చూస్తూ ఉండదు. నిరంతరం విద్యార్థుల సమస్యల పై కృషి చేస్తాం.గత వారం రోజులుగా ఎబివిపి కార్యకర్తలు కార్పొరేట్ కాలేజి అయిన నారాయణ జూనియర్ కాలేజికి ధీటుగా కృషి చేసారు. దాదాపు 100 మంది విద్యార్థుల దగ్గర లక్ష రూపాయల వరకు ఫీజు వసూలు చేసారు. వారి డబ్బుని వారికి తిరిగి చెల్లించాలని నారాయణ కాలేజి యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు.విద్యార్థులకి మోసం చేస్తున్న ఇలాంటి కార్పొరేట్ కాలేజి లకి ఇది ఒక హెచ్చరిక.ఇకనైనా డి.ఐ.ఈ.ఓ గారు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేసారు. కార్యకర్తలు పాషా,బలరాం, శ్రీ హరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *