శీర్షిక :ఓటు వైశిష్ట్యం!

రాజ్యాంగాన్ని పరిరక్షించే మానవీయతకు పెద్దపీట వేసే ఆర్తులను,అన్నార్తులను చేరదీసే

ఆశ్రిత పక్షపాతానికి తెరదింపే సబ్బoడ వర్గాల అభివృద్ధిని కాంక్షించే

ప్రజా సంక్షేమానికి విలువనిచ్చే సేవాతత్పరులనే గుర్తిద్దాం! వారికే ఓటు వేసి బలపరుద్దాం!!

తాత్కాలిక తాయిలాలకు లొంగక బంగారు భవితే ముఖ్యమని భావించి ఆశ్రిత జనానికి కొండంత అండగానిల్చే ఆ యాస ఆ ధ్యాసలో కుస్తీ పడుతూ ఆ కోణంలోనే నిరంతరం పరిశ్రమించే ప్రజాసేవకులను చేరదీద్దాం!

ఓటు వైశిష్ట్యాన్ని పెంపొందిద్దాం!!

హక్కుల కోసం తలపడటం కాదు బాధ్యతా నిర్వహణలోనూ ముందుoడాలి!

దేశం నాకేమిచ్చిందనేది? కాదు ముఖ్యం? దేశానికి నేనేమిచ్చానన్నదే అతి ముఖ్యం !

పౌరునిగా నీ విధి నిర్వర్తించు! ఓటు సద్వినియోగంపై దృష్ఠి సారించు!!..

 పరాoకుశం “రఘు నారాయణ”

గ్రామం:తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *