లక్షన్నర మెజారిటీ ఖాయం!

https://epaper.netidhatri.com/

`ప్రతి ఎన్నికలలో పెరిగే మెజారిటీ సంకేతం.

`సిద్దిపేట లో హరీష్‌ రావుకు ఎదురులేదు.

`ప్రతిపక్షాలకు చోటు లేదు.

`సిద్దిపేట ప్రజల గుండెల్లో వున్నది ఒక్కరే…అది హరీష్‌ రావే.

`ప్రజలే ప్రచారకులై…ఏకగ్రీవ తీర్మానాలు.

`గ్రామాలకు గ్రామాలే నిర్ణయాలు.

`హరీష్‌ రావు కే మా సపోర్ట్‌ అంటూ ప్రకటనలు.

`అభివృద్ధికి సిద్దిపేట ఒక ఐకాన్‌.

`సిద్దిపేట ఒక రోల్‌ మోడల్‌…హరీష్‌ రావు ప్రగతి లీడర్‌.

`పేదలకు అన్నార్థుడు…అందరికీ ఆప్తుడు.

`నిత్యం ప్రజల్లోనే… నిరంతరం జనం కోసమే.

`ఈసారి లక్షన్నర లక్ష్యం… ఏవరిని కదిలించినా ఇదే సమాధానం.

https://epaper.netidhatri.com/

గెలవాలంటే లక్ష్యం కావాలి. పట్టుదలతో గమ్యం చేరాలి. అందుకు నిరంతర పరిశ్రమతోపాటు, సంకల్ప బలం తోడుకావాలి. నాయకులు ప్రజా సేవను మనస్పూర్తిగా చేయాలి. ప్రజల గుండెల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకోవాలి. అభివృద్ధిలో చెరగని ముద్ర వేయాలి. ప్రగతిని పట్టాలెక్కించాలి. తరాలు మారినా ఆ నాయకుడు ప్రజల కళ్లముందు మెదలాలి. ఆ నాయకుడి అడుగు జాగలే నీడకావాలి. మలి తరం ఆదర్శాలకు వేదిక కావాలి. అలా నాయకుడి ప్రస్ధానం సాగితే హరీష్‌రావు అవుతారు. సిద్దిపేటలా అభివృద్ధిని చూపిస్తారు.

https://epaper.netidhatri.com/ ప్రజల బాగోగులు చూస్తారు. ప్రజల చేత మా నాయకుడు అన్ని గర్వంగా చెప్పుకునేలా సేవ చేస్తారు. అదీ హరీష్‌రావు సొంతం. అందుకే ఈసారి ఎన్నికల్లో హరీష్‌రావుకు వచ్చే మెజార్టీ ఎంత? ఇదే ప్రశ్న. ఎక్కడ విన్నా ఇదే చర్చ.. ఇదే రచ్చ… తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతున్న కీలక చర్చ ఇదే. సర్వే సంస్ధలు కూడా ముఖ్యంగా ఫోకస్‌ చేస్తున్న అంశం కూడా ఇదే. ఇటీవల ఓ సర్వే సంస్ధ ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేస్తున్న సందర్భంలో కొంత మంది నాయకులు సదరు సర్వే సిబ్బందిని అడిగిన ప్రశ్న అని సమాచారం. సర్వే సిబ్బంది అక్కడి రాజకీయ పరిస్ధితులను చెప్పండి? అని అడిగితే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు హరీష్‌రావుకు ఈసారి మెజార్టీ ఎంత రావొచ్చు? అని ప్రశ్నించారని తెలిసింది. అంటే సిద్దిపేట అభివృద్ధి గురించి నిరంతంర చర్చ జరుగుతూనే వుంటుంది. ఏ నియోజక వర్గ ప్రజలైనా సిద్ధిపేటలాగా తమ ప్రాంతం, తమ నియోజకవర్గం అభివృద్ది చెందాలని కోరుకుంటారు. అక్కడి నాయకులకు ఇదే చెబుతుంటారు. అంతే కాదు ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి విమర్శలు చేసిన సమయంలో కూడా సిద్ధిపేట అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా వుండలేరు. సిద్ధిపేటలాగా మొత్తం తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటారు. అయితే ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఆ నాయకుడి చిత్తశుద్ధి,అంకితభావం కూడా ఎంతో ముఖ్యం. అందుకే సిద్ధిపేట నియోజకవర్గాన్ని ప్రగతి పధంలో నడిపించేందుకు హరీష్‌రావు చేసిన కృషి అంతా ఇంతాకాదు. అంతే కాదు ఆయన ఎమ్మెల్యే అయిన నాటి నుంచే సిద్ధిపేట అభివృద్ధిని పరుగులు పెట్టించాడు.

ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి అసెంబ్లీలో జరిగిన చర్చలో హరీష్‌రావునుద్ధేశించి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ తరానికి తెలియాల్సిన అవసరం వుంది. సిద్ధిపేట అభివృద్ధికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నిధులను బిక్షగా వర్ణించిన సందర్భం అది. అంతే కాదు ఇకపై సిద్ధిపేటకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో? అని కిరణ్‌కుమార్‌ రెడ్డి సవాలు చేశాడు. దాంతో సిద్ధిపేట అభివృద్ధిపై మరింత కసి పెంచుకున్న హరీష్‌రావు తెలంగాణలో సిద్ధిపేట అంటే ప్రత్యేకంగా చెప్పుకునేలా తీర్చిదిద్దాడు. ఆనాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే స్వచ్ఛసర్వేక్షన్‌ అవార్డుల్లో సిద్ధిపేటకే ఎక్కువ అవార్డులు సాధించి పెట్టిన ఘనత హరీష్‌రావుది. గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చే అవార్డుల్లో కూడా సిద్ధిపేటనే ముందుంటుంది. పట్ణణాభివృద్ధి అవార్డుల్లో సిద్దిపేటనే కీలకంగా వుంటుంది. అలా దేశంలోనే ఎవరికీ ఇప్పట్లో దరిదాపుల్లోకి రానంత అభివృద్ధిని సిద్ధిపేటకు చేశారు. ఒకప్పుడు నగరంగా వున్న సిద్ధిపేటను మహానగరంగా తీర్చిదిద్దారు. పల్లెలన్నింటికీ తాగునీరు,సాగు నీరు అందించారు. సిద్ధిపేట పట్టణం మొత్తం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పూర్తి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. సాగు నీటి రంగంలో కూడా సిద్దిపేటను ముందు వరుసలోవుంచారు. ఇప్పుడు వైద్యశాఖ మంత్రిగా సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిని వైద్య కళాశాల చేసి, అన్ని వైద్య సదుపాయాలు కల్పించారు. సిద్ధిపేటలో కూడ బస్తీ దవఖనాలు ఏర్పాటు చేసి, వైద్యం అందిస్తున్నారు. దీనంతటికీ కారణం మంత్రి హరీష్‌రావు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల అధ్యయన సంస్ధలు వచ్చినా సిద్దిపేటను సందర్శించాల్సిందే. అంతగా సిద్ధిపేట అభివృద్ధికి చిరునామాగా మరింది. అందుకు మంత్రి హరీష్‌రావు ఇరవైఏళ్ల కృషి వుంది. అందుకే ఈసారి సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావుకు ఎంత మెజార్టీ రావొచ్చన్న అంశమే రాజకీయ వర్గాల్లో , మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఏడెనమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఎవరు నలుగురు కలిసి చర్చించుకున్నా ఇదే మాట? ఏ మీడియా చర్చల్లోనూ ఇదే అంశం. ఒక్కసారి హరీష్‌రావు సాధించిన మెజార్టీలను మననం చేసుకుంటే 2005లో జరిగిన సిద్ధిపేట ఉప ఎన్నికల్లో 26వేల మెజార్టీతో తొలి బోనీ కొట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ సిద్దిపేట అసెంబ్లీ తోపాటు, కరీంనగర్‌ పార్లమెంటుకు కూడా పోటీ చేశారు. ఎన్నికలైపోయిన తర్వాత ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, సిద్థిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పుడు సిద్ధిపేట బరిలో మంత్రి హరీష్‌రావు నిల్చుకున్నారు. 

ఇక్కడ విశేషమేమిటంటే ఎమ్మెల్యే కాకపోయినా అప్పటికే హరీష్‌రావు ఆరు నెలల పాటు మంత్రిగా కూడా కొనసాగారు. ఆ ఎన్నికల్లో 26వేలతో మొదలైన మెజార్టీ, 2008తో జరిగిన ఉప ఎన్నికలో 50వేలకు పైగా మెజార్టీ సాధించారు. అనంతరం జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీని 64వేలకు పెంచుకున్నారు. తెలంగాణ సాధించుకున్నాక జరిగిన 2014 ఎన్నికల్లో 90వేలకు పైగా మెజార్టీని సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. ఎవరికీ అందని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. అది 2018 ఎన్నికల సందర్భం. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ ఎన్నికల ప్రచరం సందర్భంగా సిరిసిల్లకు వెళ్తూ, పొన్నాల దాబాల వద్ద కొద్దిసేపు అగారు. ఆ సమయంలో ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా మా బావకు మెజార్టీ ఎంత రావొచ్చు? లక్ష దాటుతుందా? అని అడిగారట. అది అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. మంత్రి కేటిఆర్‌ అన్నట్లుగానే మెజార్టీ లక్షపదిహేనువేల మెజార్టీ సాధించారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం మరొకటి చెప్పుకోవాలి. ఇటీవల సిరిసిల్లలో జరిగిన ఓ పార్టీ సభలో మంత్రి కేటిఆర్‌ ఈసారైనా మా బావ హరీష్‌రావు కంటే ఎక్కువ మెజార్టీ ఇస్తారా? కేటిఆర్‌ ప్రజలను అడగడం గమనార్హం. ఇదీ హరీష్‌రావు మెజార్టీ రి కార్డు. అందుకే ఈసారి రెండు లక్షల మెజార్టీ టార్గెట్‌గా ఎన్నికల ప్రచారం సాగనుంది. ఎంత లేదన్నా ఖచ్చితంగా లక్షన్నర మెజార్టీ గ్యారెంటీ అన్న మాటలు ప్రజలే చెప్పుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. ఉద్యమ కాలంలో అటు ఉద్యమంతోపాటు, ఇటు నియోజకవర్గ అభివృద్ధిని చేపడుతూ, ద్విపాత్రాభినయం చేశారు. ఎప్పుడు సిద్ధిపేటలో వుంటారో? ఎప్పుడు ఇతర జిల్లాల్లో వుంటారో? ఎవరికీ అర్ధంకాకపోయేది. ఇప్పుడు కూడా అంతే మంత్రిగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, తెలంగాణాలో వైద్య విప్లవం తెచ్చిన ఘనత హరీష్‌రావుకు దక్కుతోంది. తాజగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించారు. ఆ మరునాటి నుంచే సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మాణాలు మొదలయ్యాయి. గతంలోనూ ఇదే విధంగా మంత్రి హరీష్‌రావుకు మద్దతుగా గ్రామాలు ఏకగ్రీవ తీర్మాణాలు చేసేవి. ఇప్పుడూ అదే ట్రెండ్‌ కొనసాగిస్తున్నారు. లక్షన్నర మెజార్టీ కోసం ప్రజలే కృషి చేస్తున్నారు. ఇదీ హరీష్‌రావుపై వున్న అభిమానానికి సాక్ష్యం. ఆయన నాయకత్వానికి నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!