భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం

*మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు*

*కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం*

నేటిధాత్రి: భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని,
తన నాయకత్వాన్ని నమ్ముకున్న వారిని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ
ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు
అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మొగుళ్లపల్లి శాయంపేట మండలాలలో పలు వివాహ వేడుకలలో ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని కొండా దంపతుల
అభిమానుల ఆహ్వానం మేరకు వివాహా వేడుకలకు పాల్గొనడానికి వచ్చిన కొండా మురళీధర్ రావుకు కొండా దంపతుల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
బాణాసంచాలు కాల్ చి ఘనంగా స్వాగతం పలికారు. చిట్యాల మండలంలోని బావుసింగ్ పల్లిలో
వివాహ వేడుకల్లో పాల్గొని, శాయంపేట మండలంలోని మైలారం
గ్రామానికి చెందిన నూనె లక్ష్మీనరసయ్య దంపతుల కుమార్తె దివ్యదేవేందర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు, వివాహ వేడుకతో ఏకమవుతున్న నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా
మురళీధర్ రావు మాట్లాడుతూ
భూపాలపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు.

కొండా అభిమానులు కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కొండా దంపతుల అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన 24 గంటలు తన ఇంటి గడప తలుపులు తెరుచుకునే ఉంటాయనీ అన్నారు. కష్టకాలంలో తమ వెంట నడిచిన అభిమానులకు అన్ని తానై వారికి తోడుగా ఉంటానని భరోసా కల్పించారు, కార్యకర్తలు అభిమానులు ఆధైర్య పడొద్ధని రానున్న రోజులు మనవేనని, కార్యకర్తలు అభిమానులు పార్టీ పటిష్టతకోసం
ఆహర్నిశలు కష్టపడి పని చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతల భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్,
కాంగ్రేస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చర్లపల్లి శ్రీదర్ గౌడ్, భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు పులి
శ్రీనివాస్ రెడ్డి, పోతుగల్లు
కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లేపల్లి తిరుపతి, నాయకులు బండి రఘుపతి,బోల్లేపల్లి అజయ్, పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి, వావిలాల గణేష్, రవి పాల్, బహుజన సంక్షేమ సంఘం అధ్యక్షులు మారేపల్లి క్రాంతి కుమార్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!