`ఈడీతో డీ..అంటే ఢీ.
`ఈడీ నో క్రెడిబిలిటీ!
`ఈ వేధింపులేంటి? కవిత సూటి ప్రశ్న.
`నేను సాక్షినా..?
`అనుమానితురాలినా?
`నిందితురాలిగా ప్రచారం ఎలా సాగుతోంది…అని నిలదీత?
`నా ఫోన్లు పగలగొట్టానన్న అసత్య ప్రచారం ఎందుకు చేస్తున్నారు?
`ఈడీని కవిత నిలదీత?
`ఇవిగో..నా ఫోన్లు?
`నేను సాక్షినే అన్నారు.. ఎన్నిసార్లైనా విచారించుకోండి?
`ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ఇన్ని సార్లు ఎందుకు విచారిస్తున్నారు?
`కవిత ధైర్యానికి దేశమంతా ప్రశంసలు.
`రాజ్యాంగ బద్ద సంస్ధ వ్యవహరించాల్సిన తీరిది కాదు?
`రాజకీయ క్షక్ష ఈడికెందుకు కవిత ఘాటు వ్యాఖ్య!
హైదరాబాద్,నేటిధాత్రి:
కవిత అంటే ఒక ప్రశ్న. కవితంటే ఒక ధైర్యం..స్ధైర్యం..ఆత్మవిశ్వాసం..ఉద్యమం..పోరాటం..తిరుగబాటుకు నిర్వచనం..నిజాయితీకి నిలువెత్తురూపం.. ప్రజాసేవకు నిలువుటద్దం..తెలంగాణ ప్రజలంటే ప్రాణం..ప్రగతి సోపానం..ప్రగతి శీల సమాజ నిర్మాణానికి తార్కాణం..కవిత. ఆమె గురించి తెలియక, ఆమె అడుగులు తెలియక, ఆమె మనోబలం తెలియక, ఆమె త్యాగం తెలియక చాలా మంది చాల రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు ఆమెను ఎలా ఎదుర్కొవాలో తెలియక, బిఆర్ఎస్ను ఎలా అంతర్మధనంలో పడేయాలో తెలియక బిజేపి అల్లిన కట్టుకధ…అల్లిబిల్లి ఆట.. కవితను లిక్కర్ కేసులో ఎలాగైనా ఇరికించాలన్న కుట్ర కోణం…బిజేపి ఈడీ వెనకుండి ఆడిస్తున్న బాగోతం….అన్నది భారతరాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త చెప్పే మాట. అవును ఇందులో బిజేపి చెప్పే మాటలకు, ఈడీ ప్రచారం చేస్తున్న వార్తలకు, కవిత విషయంలో అసలు వాస్తవాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఇది జనం అనుకుంటున్న మాట. ఇదే నిజం కూడా అంటూ దేశంలోని ఇతర పార్టీలు చెబుతున్న మాట. అయినా ఈడీ అనేదానికి ఇప్పటిదాకా ఒక క్రెడిబిలిటీ వుంటుంది. వుండాలికూడా…కాని కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు వాటిని వాడుకోవడం అలవాటుగా మార్చుకున్నాయి. ఆ పార్టీలకు వ్యతిరేకంగా వున్న పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి ఈడిని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఇది రాజకీయ పార్టీలు అనుకుంటున్న మాట. బిజేపిని తప్పుపడుతున్న మాట.
కల్వకుంట్ల కవిత.. ఒక్కరే ఇంత కాలానికి ఈడీ అనే సంస్ధకు చుక్కలు చూపించిందని చెప్చొచ్చు.
ఈడీ అత్యుత్సాహాన్ని ప్రశ్నించిన ఏకైక రాజకీయ నాయకురాలు. ఇప్పటి వరకు ఈడీ అంటే భయపడిన వాళ్లే కాని, ఎవరూ దాన్ని నిందించలేదు. నిలదీయలేదు. ఎదిరించలేదు. లోపాలు ఎత్తి చూపలేదు. కాని మొదటిసారి ధైర్యంగా కల్లకుంట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..ఈడీకే ప్రశ్నలు సంధించింది. కేసు పూర్వాపరాలు పక్కన పెడితే రాజ్యాంగ బద్ద సంస్ధ అసంబద్దంగా వ్యహరిస్తుంటే కూడా ప్రశ్నించలేకపోవడం నాయకుల తత్వం కాదు. అందుకే నింద చెరిపేసుకోగల నమ్మకం, ధైర్యం వున్న వాళ్లు మాత్రమే కవితలాగా మాట్లాడగలరు. ఆమె ఏకంగా ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌కు ఉత్తరం రాయడం ఒక సంచలనం. ఇప్పటి వరకు కనీసం అలాంటి ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. అందుకే కల్వకుంట్ల కవిత అంటే తెలంగాణ పతాక అన్న పేరు మరోసారి సార్ధకం చేసుకున్నారు. తెలంగాణ ధీర అంటే కవిత అని మరోసారి నిరూపించారు. అసలు ఈడీ చెబుతున్నట్లు లిక్కర్ కేసులో తనకేం సంబంధం అన్న ప్రశ్నను ఆమె ముందునుంచి చెబుతూనే వస్తుంది. అయినా ఈడీ చేస్తున్న విన్యాసాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. వారి అసంబద్దమైన ప్రశ్నలకు కౌంటర్లు కూడా భహిరంగంగానే ఇస్తున్నారు. అంతటి ధైర్యవంతురాలని ఎందుకు ఈ కేసులోకి లాగామా? అని అటు బిజేపి, ఇటు ఈడీలు తలలు పట్టుకునే స్ధితిని తెచ్చిన కవితను దేశం మొత్తం హాట్సాఫ్ అంటున్నారు.
ఈ నెల 11న రమ్మన్నారు..వచ్చాను..!
మళ్లీ రమ్మన్నారు…సమన్లు ఇవ్వలేదు..కాని ముందే లీక్ చేశారు..నా ఫోన్‌తో మీకేం పని..ఇంటికి పంపించి ఫోన్ తెప్పించేలా చేశారు..తెప్పించాను..దాన్ని సీజ్ ఎందుకు చేశారు..ఇదీ కవిత అభ్యంతరం. మహిళగా తనకున్న హక్కులను కాలరాసే హక్కు ఈడీకి లేదు. ఇది కవిత వాదన. ఇందులో నిజముంది? ఒక మహిళకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడం కూడ నేరమే అవుతుంది. ఈ విషయంలో సుప్రింకోర్టు ఎలా స్పందిస్తుందనేది త్వరలోనే తేలనుంది. సరే చట్టాలు చెబుతున్నాయి..అని..అంత ఖచ్చితంగా వున్నాయని ఒక మాజీ ఎంపి..ప్రస్తుత ఎమ్మెల్సీ , మహిళ అని కూడా చూడకుండా రాత్రి పొద్దుపోయేవరకు ఎనమిది తొమ్మిది గంటల దాకా విచారించాల్సినంత అవసరం ఏముంటుందో ఎవరికీ అర్ధం కావడంలేదు. అయినా పలిగిలిపోని ఫోన్లును పగిలిపోయినట్లు, పగలగొట్టినట్లు ఎవరు ప్రచారం చేశారు? ఎందుకు ప్రచారం చేశారు? ఎవరు చేయమన్నారు? ఈడీ ఈ విషయాన్ని ఎలా బైటపెట్టింది? అన్న వాటికి కూడా సమాధానాలు రావాల్సివుంది. లిక్కర్ కేసులో నిందితులుగా చెప్పబడుతున్న వారి ఫోన్ల వివరాలు బైట పెట్టడం వరకు ఓకే..కాని కవిత ఇప్పటికీ నిందితురాలి జాబితాలో లేదు. ఎఫ్ఐఆర్ ఏమీ నమోదు కాలేదు? కేవలం సాక్షిగానే కవితను పిలున్నామన్న సంగతి కూడా ఈడీయే చెబుతోంది. మరి సాక్షుల హక్కులను కాలరాయమని చట్టం చెబుతోందా? అన్నదే కవిత అభ్యంతరం. ఫోన్ అన్న తర్వాత అనేక అంశాలుంటాయి. ఆమె ప్రజా నాయకురాలు. ప్రజా సమస్యలకు సంబంధించిన వివరాలుంటాయి. కుటుంబ విషయాలుంటాయి. వ్యక్తిగత గోప్యతలుంటాయి. ఇలా అనేక రకాల విషయాలు ఫోన్లోనే నిక్షిప్తమై వుంటున్న రోజులివి. ఆమె ప్రమేయంలేకుండా, ఆమె సమ్మతం లేకుండా బలవంతంగా సీజ్ చేయడాన్ని ఆమె సవాలు చేస్తోంది. సుప్రింకోర్టును కూడా ఆశ్రయించింది. ఇలా ప్రజల హక్కులను కాలరాయడం రాజ్యాంగబద్ద సంస్ధల విధి కాదని ప్రపంచానికి తెలియజేసేందుకు కవిత మొదలుపెట్టిన ప్రశ్నల వర్షం రేపటి సమాజానికి జవాబులను అందిస్తుందని చెప్పడంలో సందేహంలేదు. అంతే కాకుండా బిజేపి వాషింగ్ పౌడర్ నిర్మా కథలను కవిత ఈడీ అధికారులను ప్రశ్నించడం కొసమెరుపు. అసలు కవిత వ్యక్తపరుస్తున్న సందేహాల మీద చర్చ చేయాల్సిన మీడియా అదిగో అరెస్టు…ఇదిగో అరెస్టు అన్న వార్తలు తప్ప…హక్కుల రక్షణల గురించి చర్చించకపోవడం గమనార్హం.