జనగామ, నేటిధాత్రి:-
మండల డిప్యూటీ తహశీల్దారుగా సిహెచ్ జగన్ భాద్యతలు చేపట్టారు. ఇప్పటివరకు జనగామ మండల డిప్యూటీ తహశీల్దారుగా పనిచేసిన శేఖర్ ను ఇదే మండల కార్యాలయంలో ఎన్నికల డిప్యూటీ తహశీల్దారుగా నియమించారు. డిప్యూటీ ఎమ్మార్వోగా భాద్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మండల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు, మీడియా ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ జగన్ మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు.
జనగామ మండల డిప్యూటీ తహశీల్దారుగా సిహెచ్ జగన్ బాధ్యతలు స్వీకరణ
![](https://netidhatri.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-19-at-6.20.06-AM.jpeg)