ఆ గళం ఒక శాసనం. ఆ గళం మహిళా జాతి నిర్మాణం. ఆ గళం భవిష్యత్తు మహిళా లోకానికి మార్గదర్శం.

https://epaper.netidhatri.com/

తెలంగాణ బతుకమ్మ విజయం!

`తెలంగాణ సాధకుడు కేసిఆర్‌… మహిళా బిల్లు సాధకురాలు కవిత!

`ఒకే కుటుంబంలో రెండు చారిత్రక విజయాలు.

`ప్రపంచంలోనే అరుదైన సందర్భం.

`పోరాటాలకు వేదికే కేసిఆర్‌ వంశవృక్షం.

`ప్రజల జీవితాల కోసమే కల్వకుంట్ల కుటుంబం.

`బతుకమ్మ తో కవిత తెలంగాణకు స్పూర్తి.

`మహిళా బిల్లుతో దేశానికే కవిత కీర్తి.

`మహిళా బిల్లుపై దశాబ్ద కాల గళం కల్వకుంట్ల కవిత

`మహిళా బిల్లుపై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం.

`దశాబ్దాల కల నెరవేరడంలో కవిత పాత్ర.

`మహిళా బిల్లు కోసం ఎలుగెత్తిన ఏకైక గళం కల్వకుంట్ల కవిత.

మునుగోడు బిఆర్‌ఎస్‌ నాయకురాలు, జడ్పీటిసి, జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ చైర్మన్‌ ‘‘నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్‌’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో.. లి’’తెలంగాణ బతుకమ్మ’’ ‘‘మా కవితక్క’’సాధించిన విజయం అంటు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే…

హైదరాబాద్‌,నేటిధాత్రి:
పోరాటాల పురిటి గడ్డలో పుట్టిన ఉద్యమ యోధురాలు కవిత. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల గోసకు చరమ గీతం పాడేందుకు అలుపెరగని పోరాటం ధీశాలి కవిత. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని అస్తిత్వ పతాకను చేసిన ఘనత కవితది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్డిన బతుకమ్మ కవిత. నాడు తెలంగాణ ఉద్యమంలో కీలకమై, నేడు మహిళా బిల్లు రాకకు కారణమై, దేశ ప్రజలను ప్రశంసలు అందుకుంటోంది. ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజల గుండెల్లో చైతన్యం నింపింది. తెగించి కొట్లాడిరది. మహిళా బిల్లు పోరాటంతో దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరుగా గుర్తింపు పొందింది. దటీజ్‌ కల్వకుంట్ల కవిత అని కొనియాడబడుతోందంటున్న మునుగోడు బిఆర్‌ఎస్‌ నాయకురాలు, జడ్పీటిసి, జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ చైర్మన్‌ నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు రావుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే…
కల్వకుంట్ల కవిత మహిళా లోకపు చైతన్యానికి ప్రతీకగా నిలిచింది.
ఉద్యమమైనా, పోరాటమైనా సాధించే వరకు ఎత్తిన పిడికిలి దించలేదు. పోరు బాటలో మడమ తిప్పలేదు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఏర్పాటు గురించి చర్చ మొదలు కాగానే మహిళా బిల్లు గురించి మళ్ళీ ప్రస్తావించిన ఒకే ఒక్క నేత కవిత. ఇలా అడుగడుగునా మహిళా బిల్లు కోసం దశాబ్ద కాలంగా ఒంటరి పోరు సలుపుతోంది. డిల్లీ వేదికగా నిరసన తెలియజేసిన ఏకైక మహిళా నాయకురాలికా ప్రశంసలు అందుకుంటోంది. తెలంగాణ మహిళా సమాజం కవితకు సెల్యూట్‌ చేస్తోంది. మహిళా బిల్లు సాక్షిగా దేశం దృష్టిలో కవితకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఒక వ్యక్తి జీవితంలో ఒక విజయమే గొప్ప అనుకుంటాం. కానీ అడుగడుగునా విజయపతాకాలు ఎగురవేయడం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కొందరికే సాధ్యం. కవిత లాంటి ఆదర్శ మహిళా నేతలకే సాధ్యం. అంటూ మహిళా బిల్లు వాస్తవ రూపం దాల్చేందుకు ప్రధాన కారణం కల్వకుంట్ల కవితే కారణం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాదనకున్న తెలంగాణ తెచ్చారు. కల్వకుంట్ల కవిత మహిళా బిల్లు సాధించారు. ఇలాంటి చారిత్రక సందర్భాలు కల్వకుంట్ల కుటుంబానికే సొంతం. ఆ కుటుంబమే దేశం కోసం పుట్టినట్లు వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ సాధన కోసం తన రాజకీయ జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశాడు. పదవులను తృణ ప్రాయంగా వదిలేశాడు. అలుపెరుగని పోరాటం చేశాడు. చరిత్రలో ఎవరూ సాధించలేరనకున్న తెలంగాణ ను సాధించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ తల రాత మార్చాడు.
ఎవరు ఔనన్నా! ఎవరు కాదన్నా ముమ్మాటికీ మహిళా బిల్లు విషయంలో కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం కల్వకుంట్ల కవిత సాధించిన అద్భుతమైన విజయం.
ముఖ్యమంత్రి కేసిఆర్‌ అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చారు. తెలంగాణ గోస తీర్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేశాడు. కోట్లాది తెలంగాణ ప్రజల గొంతుకయ్యాడు. తెలంగాణ కావాలని నిరంతరం నినదించాడు. మాటి పాలకులను అడుగడుగునా నిలదీశాడు. బరి గీసి కొట్లాడి తెలంగాణ సాధించి ప్రజలకు అందించాడు. తెలంగాణ ఆత్మ గౌరవం నిలిపాడు. ఆ నేత తనయగా తెలంగాణ సాంస్కృతిక స్వరూపమైన బతుకమ్మను తెలంగాణ ఆత్మగా నిలబెట్టారు. తెలంగాణ బతుకమ్మగా కల్వకుంట్ల కవిత కొనియాడబడుతున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ యువతలో చైతన్యం నింపారు. వెనుకబాటుపై సమరం చేశారు. తెలంగాణ యువతలో ఆత్మస్థైర్యం నింపారు. వారికి అండగా నిలిచారు. వారి ఉపాధి కల్పనకు మార్గం చూపారు. తెలంగాణ యువతకు సాంకేతిక పరిజ్ఞానం దగ్గర చేశారు. వారికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను అనేకం ఏర్పాటు చేశారు. ఎంతో మంది యువత భవితకు మార్గం చూపారు. వారి కుటుంబాలలో వెలుగులు నింపారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ బాధ్యతను కూడా ఎత్తున్నారు. బతుకమ్మకు తెలంగాణ ఆత్మ నింపి ఊరూ వాడా కదిలించారు. జిల్లాలను ఏకం చేశారు. ట్యాంక్‌ బండ్‌ ను పూల వనం చేసి, బతుకమ్మకు ఆలంబన చేసి, తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చూపారు. అదే బతుకమ్మను తలపై మోసుకుంటూ దేశ దేశాలలో వున్న తెలంగాణ ప్రజలను కదించారు. ఒక్క తెలంగాణ గడ్డమీదనే కాదు, ప్రపంచంలో తెలంగాణ ప్రజలున్న ప్రతి గడ్డ మీద బతుకమ్మను పేర్చి పూజించిన ఘనత కూడా ఒక్క కవితకే దక్కుతుంది. అలా తెలంగాణ ఉద్యమ సాధనలో వంటా వార్పులను సృష్టించి, ఉద్యమ కారు అందేద తెలంగాణ సా తెలంగాణ బతుకమ్మ విజయం!
మహిళా బిల్లుపై దశాబ్ద కాల గళం కల్వకుంట్ల కవిత.
తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కల్వకుంట్ల కవిత నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు కు ఎన్నికయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఆకాంక్షలు, విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు, అనేక సందర్భాలలో కవిత మహిళా సాధికారత గురించి మాట్లాడుతుండే వారు. అనర్గళమైన వాక్చాతుర్యంతో, సబ్జెక్టు మీద పూర్తి అవగాహనతో పార్లమెంటు వేధికగా చెప్పాల్సిన విషయాలను సూటిగా, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం కవితకే సాధ్యం. ఏ విషయాన్నైనా ఎంతో లోతుగా అధ్యయనం చేస్తుంది. అందుకే అంత స్పష్టత ఆమె పరిజ్ఞానంలోనే వుంది. వయసులో చిన్న అయినా ఆమె పార్లమెంటులో మాట్లాడుతుంటే సభ్యులు ఎంతో ఆసక్తిగా వినేవారు. కవిత లో వున్న సునిశితమైన పరిజ్ఞానాన్ని తెలుసుకొని, అప్పటి పార్లమెంటు కమిటీలలో సభ్యురాలిగా తీసుకున్నారు. పార్లమెంటు బృందాల వివిధ దేశాల పర్యటనలలో కూడా కవితకు అత్యంత పాధాన్యతనిచ్చే వారు. దాంతో ఆమె అంతర్జాతీయ వేధికల మీద కూడా అనేక ప్రశంసలు అందుకున్నారు. మహిళా బిల్లు విషయంలో కూడా పార్లమెంటు లో అనేక సార్లు ప్రస్తావించారు. నిజానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళా బిల్లు ఎప్పుడో రావాల్సింది. 1996 లో అప్పటి ప్రధాని దేవెగౌడ ప్రభుత్వంలోనే వస్తుందని ఆశించాం. తర్వాత వాజ్‌ పాయ్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. తర్వాత యూపీఏ ప్రభుత్వంలో రాజ్యసభలో బిల్లు పాసై ఆగిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పార్లమెంటుకు ఎన్నికైన కవిత పదే, పదే ఈ విషయాన్ని అటు పార్లమెంటు లో, ఇటు బైట కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ దశాబ్ద కాలంగా మహిళా బిల్లుపై మాట్లాతున్న ఏకైక మహిళా నాయకురాలు కవిత. ఆమె తప్ప ఏ ఒక్క మహిళా నేత ఇంతలా మాట్లాడిన వారు మరొకరు లేదు. అంతే కాకుండా డిల్లీ వేధికగా పెద్ద ఎత్తున దేశం నలుమూలల నుంచి మహిళా నేతలను ఆహ్వానించి నిరసన కార్యక్రమం చేపట్టిన నేత కూడా కవితే కావడం గమనార్హం.
మహిళా బిల్లుపై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు పార్లమెంటు లో చర్చ కు వస్తోంది. ముమ్మాటికీ ఇది కవిత సాధించిన విజయమనే చెప్పాలి. దశాబ్దాల కల నెరవేరడంలో కవిత పాత్ర చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించినట్లే. ఇంతకాలం మహిళా బిల్లు కోసం ఎలుగెత్తిన ఏకైక గళం కవిత. ఆ గళం ఒక శాసనం. ఆ గళం మహిళా జాతి నిర్మాణం. ఆ గళం భవిష్యత్తు మహిళా లోకానికి మార్గదర్శం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *