Reliance Mart Cheating Allegations in Zaheerabad
ప్రజలను మోసం చేస్తున్న జహీరాబాద్ రిలయన్స్ మార్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ రిలయన్స్ మార్ట్ వినియోగదారుల ఆరోపణలు మరోసారి రిటైల్ రంగంలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తాయి.ఆఫర్ల పేరుతో అసలు ఎం.ఆర్.పి నే వసూలు చేస్తున్నట్లు కస్టమర్లు గుర్తించడం, అనంతరం సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన ఇవి పెద్ద రిటైల్ చైన్లలో కొనసాగుతున్న ధరల్లో అనిబంధితుల దందాకు స్థానిక ఉదాహరణలు మాత్రమే. తెలంగాణలో ఇటీవలి సంవత్సరాల్లో ఫుడ్ అండ్ కన్జ్యూమర్ సేఫ్టీ విభాగం పలు మార్ట్‌లపై జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయిబీ అయినప్పటికీ, బిల్లింగ్ పారదర్శకత, ఎంఆర్పీ అమలు, ఆఫర్ క్లెయిమ్‌ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ మేనేజర్ తప్పును ఒప్పుకోవడం సమస్య యొక్క తీవ్రతను సూచించినప్పటికీ, ఇది వ్యవస్థాగత లోపాలను సరిచేయడానికి సరిపోదు. స్థానిక వినియోగదారులు, పౌరసంఘాలు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.
రిలయన్స్ మార్ట్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలి, కేసు నమోదు చేయాలని సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్.మహిపాల్.రిలయన్స్, ఇతర పెద్ద పెద్ద మార్ట్ లలో మోసాలను ప్రజలు గమనించి లోకల్ కిరణా షాపులను ప్రోత్సహించాలన్నారు,
