
Manik Rao campaigns for BRS in Jubilee Hills
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం
◆:- బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపి నాథ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని రహమత్ నగర్ (శ్రీరామ్ నగర్) డివిజన్లో పర్యటించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపి నాథ్ గారిని భారీ మెజారిటీ గెలిపించాలని ,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ బాకీ కార్డులను ఇంటింటికి పంచుతూ ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు మునీరుద్దీన్, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,నాయకులు, మైనారిటీ నాయకులు, మహిళా నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.