కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటిన యువ ఫౌండేషన్ అభ్యర్థులు

20 మందికి పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఫలించిన కానిస్టేబుల్ రాజశేఖర్ కృషి

వేములవాడ డి ఎస్పీ శ్రీ నాగేంద్ర చారి గారికి రుణపడి ఉంటాం-అభ్యర్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న అభ్యర్థులలో 21 మందికి నిన్న వెలువడిన తెలంగాణా పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల లో వివిధ కానిస్టేబుల్ విభాగాలలో ఉద్యోగాలు వచ్చాయి. ఈ సందర్బంగా యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలనుండి యువతకు యువ ఫౌండేషన్ ద్వారా ఉచిత ఫిజికల్ శిక్షణ తో పాటు మోటివేషన్ క్లాస్ లు ఇస్తున్నాం అని, ఇప్పటి వరకు యువ ఫౌండేషన్ నుండి 40 మంది పోలీస్, ఆర్మీ ఉద్యోగాలు సాధించారు అని,నిన్న వెలువడిన ఫలితాల లో సివిల్ కానిస్టేబుల్ -5, ఆర్ముడు రిజర్వ్ (AR)-9,తెలంగాణా స్పెషల్ పోలీస్ (TSSP)-7 మొత్తం 21 మందికి ఉద్యోగాలు వచ్చాయి అని,దేశ సేవ కోసం తన వంతుగా యువ ఫౌండేషన్ నుండి యువకులను ఉద్యోగార్థులు గా తయారు చేస్తున్నాను అని, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి భవిష్యత్తు కోసం మార్గ నిర్దేశం చేయటం లో యువ ఫౌండేషన్ సహకరిస్తుంది అని,అభ్యర్థులు ఉద్యోగాలు సాధించటం చాలా ఆనందం వుంది అని, శిక్షణ కు ఉన్నతధికారుల సహకారం మరువలేనిది అని,ఈ 2023 బ్యాచ్ శిక్షణ లో మాకు సహకరించి, అభ్యర్థుల కు పలు సూచనలు చేసి, అభ్యర్థుల కు ఉచిత స్టడీ హల్ వసతి కల్పించిన వేములవాడ డి ఎస్పీ శ్రీ. నాగేంద్ర చారీ గారికి నేను మరియు అభ్యర్థులు ఎప్పటికి రుణపడి ఉంటాం అని, ఉచితంగా స్టడీ హల్ ఇచ్చిన సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీస్ ఉన్నతధికారులు, తోటి సిబ్బంది అభినందించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యులు రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!