
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో వైయస్సార్సీపి నాయకులు బిఆర్ఎస్ లో చేరారని మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు వైయస్సార్సీపి రాష్ట్ర నాయకుడు న్యాయవాది భుజాల వెంకటేశ్వర రెడ్డి జిల్లా నాయకులు జస్వంత్ రెడ్డి దినేష్ రెడ్డి శ్యామ్ నిరంజన్ శ్రీనివాసులు కాంతయ్య మాణిక్ రెడ్డి లకు మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారని అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఆవుల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆయన పేర్కొన్నారు