
# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణా స్టేట్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేషం గౌడ్ పై నిరాదారమైన ఆరోపణలు చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ శివారెడ్డి వెనక్కి తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం సర్వాపురం గౌడ సంఘ భవనం ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షణ పథకం కింద 2400 కోట్లు మంజూరు చేయక ముందే వెంకటేషం గౌడ్ 150 కోట్లు స్వాహా చేశాడని శివారెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. అనగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే వెంకటేశంగౌడ్ పదేళ్లుగా నియామకాలు లేని యూనివర్సిటీ వీసీ కోసం సిర్చ్ కమిటీలు ఏర్పాటు చేశాడన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బందిగా ఉన్న 317 జీఓను ప్రక్కన పెట్టాడని పేర్కొన్నారు.ఇప్పటికైనా వెంకటేశం గౌడ్ పై ఆదారం లేని ఆరోపణలు చేసిన శివారెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని,లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న వారసులైన గౌడ్ లు బట్టలూడదీసి కొడతామని రమేష్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, పట్టణ అధ్యక్షులు గండి గిరి గౌడ్, చెన్నారావు పేట కన్వీనర్ గోడిశాల మల్లయ్య గౌడ్, ఖానాపురం మండలం అధ్యక్షులు మేరుగు గంగాధర్ గౌడ్, సట్ల సురేష్ గౌడ్, గుర్రం కృష్ణమూర్తి గౌడ్, సట్ల సంతోష్ గౌడ్, దొమ్మటి శ్రీనివాస్ గౌడ్, బూర్గు కట్టయ్య గౌడ్, మచ్చిక శివ కుమార్ గౌడ్, జలగం నర్సయ్య గౌడ్, తాళ్ల పెళ్లి కుమార్ గౌడ్, మండ రాకేష్ గౌడ్, అనంతుల స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.