నడికూడ,నేటి ధాత్రి:
పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలం పులిగిళ్ల గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరడం జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, నియోజకవర్గంలో టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నామని దాని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కించుకుంటామని తెలిపారు.
పార్టీ లో చేరిన వారు కుక్కల సంతోష్,రంజిత్ ,రాకేష్, ఒడులాపూర్ నితీష్, కుక్కల సందీప్,మోటుపోతుల సమ్మయ్య, సురబు వినయ్,కుక్కల శ్రీకాంత్, ఎండి షేముషారద్దీన్,పర్శ రమేష్,బొల్లే వెంకటేష్ ,రాజు, ఇనుగాల వంశీ, బోగం కిషోర్ , శ్రీకాంత్ ,రాజేష్ , గజ్జ మనిరాజ్ , బోగం అన్వేష్ , దాసరి రాహుల్ , బొల్లే శ్రావణ్ ,ఇనుగాల అభి,బెతూ శ్రీకాంత్,జక్కుల వినయ్,ప్రణయ్, కుక్కల రమేష్ , చెలిక నగేష్ ,కాసు సంతోష్ ,మెండి సురేష్ , పంజాల సారంగపణి,అమ్మ సంతోష్,దొంగల వినయ్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బీజేపీ,కాంగ్రెస్ పార్టీ నుండి బి.ఆర్.యస్.లోకి చేరిన యువత
