యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

టేకుమట్ల ఎస్సై ప్రసాద్

భూపాలపల్లి నేటిధాత్రి

గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని టేకుమట్ల ఎస్సై ప్రసాద్ విధ్యార్థులకు సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై టేకుమట్ల పోలీసుల అధ్వర్యంలో టేకుమట్ల జిల్లా పరిషత్ విద్యార్థిని విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టేకుమట్ల ఎస్సై ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైనారు ఈ సందర్బంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో వుందని. ఈ ప్రమాదం భారీన పడకుండా యువత అప్రమత్తంగా వుండాలని. కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాల సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఓ కలగానే మిగిలి పోతుందని. కొంత మంది వ్యక్తులు తమ డబ్బు సంపాదన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడి యువతకు అందించడం జరుగుతోందని. ఇలాంటి స్వార్థపరుల చేతుల్లో యువత బలికావద్దని. ఎన్నో అశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకై ఎదురుచూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఎలాంటి వేదనకు గురౌవుతున్నారు. ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి
మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయని యువత గ్రహించాలని. అలాగే మీ తోటి మిత్రులు గంజాయిని సేవిస్తున్నట్లయితే మత్తు పదార్థాల వినియోగం ద్వారా నష్టాలపై వారి అవగాహన కల్పించాలని. ప్రధానంగా గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం ప్రత్యేక చోరవ చూపిస్తోందని. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి పరిధిలో గంజాయి నియంత్రణకై డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవిస్తున్న, రవాణా, విక్రయాలు పాల్పడుతున్న వారిపై పట్టుకోవడే ఈ విభాగం ప్రత్యేకతని. ఎవరైన మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన సమాచారం అందించడం ద్వారా వారిపై తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని. పెద్దఎత్తున గంజాయి సమచారం అందించిన వారికి నగదు పురస్కారం కూడా అందజేయబడుతుందని. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని ఎస్సై తెలిపారు. ఈ సమావేసంలో హెచ్ఎం సుధాకర్ సార్ ఏఎస్ఐ అమరేందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్ మహేందర్ హోంగార్డ్స్ గంగరాజు మొగిలి వైస్ ఎంపీపీ ఐలయ్య ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు, విద్యార్థినివిధ్యార్థులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!