యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలి:
◆:- షేక్ సోహెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలో తుమ్మనపల్లి గ్రామ, బిఆర్ఎస్ పార్టీ యువనేత షేక్ సోహెల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి కోసం యువత తమ చదువు, విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్వార్థపరుల పాలనలో గ్రామాలు నాశనం కాకుండా చూడాలని సూచించారు. రోజుకు రెండు మూడు గంటలు గ్రామాల అభివృద్ధికి కేటాయించి, ప్రజలను చైతన్యపరిచి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సిద్ధయ్య పిలుపునిచ్చారు. గెలిస్తే చరిత్ర, ఓడితే అనుభవం అని ఆయన అన్నారు.
