కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి :
సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో దేశసేవలో యువత భాగస్వాములు కావాలని, దేశసేవ దైవసేవతో సమానమని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ యువతకు పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలో ఎదల్లపల్లి గ్రామానికి చెందిన చలమల్ల రాజారెడ్డి ఆర్మీలో 21 సంవత్సరాలుగా దేశ సేవకై విధులు నిర్వహించి ఎన్ బీ సాబ్ గా పదవీ విరమణ పొందాడు.ఈ నేపథ్యంలో గురువారం నర్సంపేట పట్టణంలో రిటైర్డ్ ఆర్మీ రాజారెడ్డికి నర్సంపేట పట్టణ యువత ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద శాలువాతో సన్మానించి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ నేటి యువత దేశ రక్షణకు సేవలు అందించడంలో పోటీపడాలని దేశస్పూర్తిని విస్మరించి తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలే యువతకు ధ్యేయం కాకూడదన్నారు. ఆర్మీలో సేవలు అందిస్తున్న తెలంగాణ జవాన్లకు సెల్యూట్ అని వారి స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశ రక్షణలో వారి సేవలకు విలువ కట్టలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్, నాంపల్లి వెంకన్న,ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడు కటారి ఉత్తమ్ కుమార్, బాలు, కోమండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.