రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద జిట్ట బాలకృష్ణరెడ్డి అకాల మరణం పట్ల చింతిస్తూ సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో యువజన సంఘాల సమితి, జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు అధ్వర్యంలో నివాళులర్పించారు. యువత సంక్షేమం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం తన ఆస్తులను కరిగించిన గొప్ప వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి అని పలువురు యువజన నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని యువజన సంఘాలను ఏకం చేసి యువత సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో యువజన సంఘాల ప్రతినిధులు, యువకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.