రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్లమ్మ చెరువు కట్టకు గండిపడడంతో అందులోని చేపలన్ని కొట్టుకుపోయి సుమారు పది లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ద్వారా ఆనష్టపరిహారం అందించాలని రామడుగు తహసిల్దార్ వెంకటలక్ష్మికి రామడుగు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మత్స్య కార్మికులు తాతల కాలం నుండి చేపలు పట్టుకుని జీవిస్తున్నామని మొన్నటి వర్షాలకు ఎల్లమ్మ చెరువు కట్ట తెగడంతో తాము రెండేళ్లుగా కొని పోసి పెంచుకున్న చేపలన్నీ వరదకు కొట్టుకుపోయాయని దీంతో తమకు పది లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని తహశీల్దార్ కి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కోన్నారు. ఈకార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు జిట్టవేణి రాజు, ఉపాధ్యక్షులు నీలం రవి, మామిడి నర్సయ్య, గుర్రం లక్ష్మిపతి, బసరవేని రాజయ్య, తదితరులున్నారు.