
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రంజాన్ మాసం పురస్కరించుకొని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తన స్వంత ఖర్చులతో ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగకు తోపాలను పంపిణీ చేసిన జడ్చర్ల బి ఆర్ ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి . ఈ సందర్భంగా అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ పేదరికానికి కులం, మతం లేవని పేర్కొన్నారు. పేదలకు సేవ చేయడంలోనే ఆత్మసంతృప్తి దొరుకుతుందని తెలిపారు. తదనంతరం ముస్లిం సోదర, సోదరీమణులకు అభిమన్యు రెడ్డి ముందస్తుగా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచాల కృష్ణయ్య, ఉప సర్పంచ్ బోయ నిలమ్మ, వార్డుమేంబెర్స్ వన్నె రాజు, మంచాల నర్సింహులు, మంచాల జ్యోతి, బోయ రాజు, బత్తుల యాదయ్య గౌడ్, కో ఆప్షన్ మెంబెర్స్అజమోద్దీన్, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యాదయ్య, ఉపాధ్యక్షులు అజీమ్, యూత్ వింగ్ గ్రామ అధ్యక్షులు బోయ రాజు, ఉపాధ్యక్షులు ప్రేమ్ కూమార్, మంచాల మల్లేష్, ఫక్రు, మైన, వీర స్వామి, కృష్ణ, సురేష్, హైమత్, రాకేష్, అభిమన్యు యువసేన నాయకులు, ముస్లిం సోదరి సోదరమణులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.