వివిద పార్టీల నుండి యువత బిఆర్ఎస్ లోకి భారీ చేరిక

యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి.

ఎమ్మెల్యే రెడ్యా నాయక్

దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలోనే ఉన్నది

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు.

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ని నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల కు చెందిన సుమారు 300 మంది యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో చేరికలు ఏర్పాటు చేశారు, కాంగ్రెస్, బిజెపి పార్టీ ల నుoడి యువ నాయకులకు కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ ఆహ్వానించడం జరిగింది వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అటువంటి పథకాలను చూసి ఆకర్షితులై కేసీఆర్ యొక్క పథకాలకు ఈరోజు కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది అన్నారు,ఈ సందర్భంగా యువతకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో యువత రాజకీయాలలో ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు,ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని, కడుపులో పెట్టుకోని చూసుకుంటానని ఏ అవసరం వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా నేనుంటానని,డోర్నకల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది అంటే అది రెడ్యానాయక్ మాత్రమే అని అన్నారు, అమాస పునానికి వచ్చే నాయకుల మాటలు యువత ఆలోచించాలని సరైన మార్గాల్లో వెళ్లాలని పిలుపునిచ్చారు ,కాంగ్రెస్, బిజెపి పార్టీల పని అయిపోయిందని వారు చేసేది ఏమీ లేదని అన్నారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సింధూర, మునిసిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారద రవీందర్, యువనేత డిఎస్ రవిచంద్ర,మరిపెడ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వరరావు,మారిపెడ మాజీ ఎంపిపి గడ్డం వెంకన్న, మాజీ ఎంపీటీసీ గంధసిరి మైనార్టీ నాయకులు లతీఫ్, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీలోకి చేరినవారు మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *