పరకాల నేటిధాత్రి
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ 2024 సంవత్సరం నూతన క్యాలెండర్ ను పరకాల ఏసీపీ ఇ.కిషోర్ కుమార్ సోమవారం ఏసీపీ కార్యాలయంలో యాక్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్ మరియు యాక్ సభ్యులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సమాజంలోని అన్ని రంగాలలో పేరుకుపోయిన అవినీతి భూతాన్ని అంతం చేయడంలో అవిశ్రాంత పోరాటం చేస్తున్న యాక్ టీమ్ ను అభినందిస్తూ, ముఖ్యంగా విద్యార్థులలో అవినీతి రహిత సమాజం కోసం అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అన్నారు.ప్రతీ ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే విధముగా యాక్ కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వరంగల్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్,పరకాల మండల ఉపాధ్యక్షుడు బాసాని. సుమన్,నడికూడ మండల అధ్యక్షుడు చేపురి నాగరాజు, యాక్ జిల్లా కమిటీ సభ్యులు పావుశెట్టి తరుణ్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించిన పరకాల ఏసీపీ
