*కృత్రిమ కరువు సృష్టిస్తుంది బిఆర్ఎస్ వారే
*ఫోన్ ట్యాపింగ్ కేసులో పీకల్లోతు కష్టాల్లో కుటుంబ సభ్యులు
*అధికారం కోల్పోయిన బాధలో మతిభ్రమించి మాట్లాడుతున్న బావ బామ్మర్దులు
*కాలేశ్వరాన్ని కామధేనువుగా వాడుకున్నది మీరే కదా
*కాలేశ్వరంలోని 10 టిఎంసిల నీరు సముద్రంలోకి వదిలేసింది మీ ప్రభుత్వ హయాంలోనే
*ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ మంత్రి,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తంగళ్ళపల్లి లో మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని మాట్లాడడం చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం వేములవాడ పట్టణంలో విలేకరులతో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే వారికి మతి భ్రమించి, అధికారం కోల్పోయిన భ్రమలో తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
ఒకవైపు తన సోదరి కవిత లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో జైలో ఉందని, ఫోర్జరీ,ఛీటింగ్ కేసులో సంతోష్ రావు, బావ బామ్మర్దులు హరీష్ రావు కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఫోన్ ట్యాపింగ్ కేస్ లో రోజుకు ఒక కథనం వినిపిస్తున్న వేళ మతి కోల్పోయి మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని, వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాలు పడడం లేదని వాళ్ళు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు.వాళ్ళ మాటలు చూస్తుంటే బావా బామ్మర్దులు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని కంకణం కట్టుకున్నారని అనిపిస్తుందన్నారు.
గత తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో కేవలం మీ కుటుంబ సభ్యుల బాగుపడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చేసింది ఎంలేదన్నారు..మీ కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలు కేసుల్లో పీకల్లోతుకి మునిగిపోయారన్నారు.
ఫోన్ టాపింగ్ విషయంలో కల్వకుంట్ల కుటుంబం బందీ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ పరిధిలో ఎవరే మాట్లాడుతున్నారో విన్న మీరు ఈరోజు నైతికథ గురించి మాట్లాడడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వింటూ వ్యాపారస్తుల మాటలు వింటూ రాజకీయ నాయకుల మాటలు వింటూ సినీ ప్రముఖుల మాటలను కూడా విన్నారని అవి తెలంగాణ ప్రజలకు తెలిసి ఆ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతాము అని భయంతో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.
అసలు రాష్ట్రంలో కృత్రిమ కరువు బిఆర్ఎస్ వారే సృష్టిస్తున్నారని లక్షల కోట్ల ప్రజాధనంతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి అది కృంగిపోగానే పది టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు.
రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష నాయకుని హోదాలో కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.. ప్రజలు బిఆర్ఎస్ వారి మాటలు నమ్మే రోజులు పోయాయని రాష్ట్రంలో కరువు రావాలని బిఆర్ఎస్ కోరుకుంటున్నారని అన్నారు.
గత పాలకులకు ముందు చూపు లేకపోవడం వల్ల శ్రీకృష్ణ జలాలను పక్క రాష్ట్రం వారికి అప్పజెప్పారని అన్నారు.. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై 6 లక్షల 67 వేల కోట్ల భారం మోపరన్నారు.
ప్రజలు బిఆర్ఎస్ వారు చేస్తున్న ఆరోపణలను నమ్మొద్దని ఇంత కష్టకాలంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది అన్నారు.
6 గ్యారంటీలపై వారు చేస్తున్న ఆరోపణలు చూస్తే నవ్వొస్తుంది అన్నారు. రాష్ట్రంలో మహిళా తల్లులకు ఉచిత ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల పెంచామన్నారు.. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నామని, 500 కే సిలిండర్ తో పాటు ప్రతి నియోజకవర్గానికి 3600 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు.. తంగళ్ళపల్లి లో కేటీఆర్ మాట్లాడిన మాటలు ఖండిస్తున్నామన్నారు.. వారి వెంట పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు సాగరం వెంకటస్వామి,సంగ స్వామి,కూరగాయలు కొమురయ్య, కనికరపు రాకేష్, కూర దేవయ్య, పుల్కం రాజు తదితరులు పాల్గొన్నారు.