
government holiday
ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి.
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
భూపాలపల్లి నేటిధాత్రి
2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవం వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజున మహా ముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన శైలి ఇతర సమాజాలకు భిన్నంగా ఉంటుందనీ, ఆదివాసులు విగ్రహ ఆరాధకులు కాదని, పకృతి ఆరాధకులని వీరి పూజా వ్యవహారాలు వేరుగా ఉంటాయని అన్నారు, వీరిని జనగణలలో ఏదో ఒక మతం కింద నమోదు చేయడం వలన వీరి అభివృద్ధి కి అస్తిత్వానికి ముప్పు
వాటిల్లుతుందని అందుకే 2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని అదేవిధంగా ఆదివాసి దినోత్సవం ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినప్పుడే ఆదివాసులలోని ఉద్యోగులు మేధావులు సంస్కృతి మీద సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొనడం వలన ఆదివాసులకు ఉపయోగం జరుగుతుందని కావున అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 ని ప్రభుత్వ సెల్లు దినంగా కేటాయించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించి ఆదివాసి గ్రామాలలో సమస్యలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ,అదేవిధంగా ఆదివాసి జెండా పండుగలు వారోత్సవాలలో భాగంగా ప్రతి గ్రామంలో జెండా పండుగలు చేసుకుంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలు కలలు పునర్జీవింప పడేవిధంగా ఆదివాసి సమాజం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు ఆదివాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పోలం సతీష్ బదిరాజయ్య రామినేని రాజు నాగరాజు తోట లక్ష్మయ్య గుంటి అంజలి తోట శ్రీ చందన గుండప్పు తేజస్విని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు