నిజాంపేట, నేటి దాత్రి
నిజాంపేట్ రైతువేదిక యందు ప్రపంచ నేల దినోత్సవం (సాయిల్ హెల్త్ డే) ని పురస్కారించుకొని రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి మాట్లాడుతూ నేలల ను పరిరక్షణ చేసుకొని పరిపుష్టి నేలల ను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తుచేశారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం, వానపాముల ఎరువు వాడకం ద్వారా నేల ఆరోగ్యాన్ని రక్షిస్తూ మంచి పంట దిగుబడులని సాధించవచ్చు అని చెప్పారు. అలాగే వరి పొలములో వరి కొయ్యలను కాల్చగూడదు అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.