వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తేది:09-10-2023,సోమవారము రోజున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము సందర్భంగా విద్యార్థీనీ విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము ప్రతి ఏటా అక్టోబర్ 10 న అన్ని దేశాలలో నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.బి.రాజగోపాల్ అధ్యక్షత వహించగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు.
మానసిక సమస్యలకు గల కారణాలు, మానసిక సమస్యల సంకేతాలు మరియు మానసిక సమస్యలకు పరిష్కారాలను డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.విద్యార్థీనీ విద్యార్థులు ఎదుర్కొను ముఖ్యమైన మానసిక సమస్యలు మానసిక ఒత్తిడి , ఆందోళన, కుంగుబాటు ను ఎలా పరిష్కరించుకోవాలో సోదాహరణంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. పరీక్షల భయాన్ని, ఓటమి భయాన్ని, ఒంటరి తనం, సర్దుబాటు సమస్యలను ఎదుర్కొనే పద్దతులు తెలిపారు. మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల కలిగే దుష్పరిణామాలను, వ్యసనాలకు దూరంగా ఉండే పద్దతులను పవర్ పాయింట్ ప్రజ౦టేషన్ ద్వారా వివరించారు.
ప్రిన్సిపల్ డాక్టర్.బి.రాజగోపాల్ విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి శక్తి ఎలా పెంపొందించుకోవాలో తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమములో ప్రోగ్రామ్ కొ-ఆర్డినేటర్ ఏం. ప్రతాప రెడ్డి, శాఖాధిపతులు రవి కుమార్, ప్రభాకరా చారి, సయ్యద్ షహాబాజ్, ఉపన్యాసకులు రాజేందర్, పవన్ కుమార్, శ్రీదర్, విద్యార్థీనీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఆరోగ్యం పై అవగాహన సదస్సు
