*ప్రపంచ మేధావిబి.ఆర్ అంబేద్కర్
మొగుళ్లపల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆద్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భౌద్ధమతం స్వీకరించిన రోజును పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హిందువుగా పుట్టి హిందువుగా మరణించనని భారత దేశంలో ఉన్న అన్ని మతాల గురించి తెలుసుకొని చివరకు గౌతమ బుద్ధుడి బోధనలు సూక్తులు సిద్ధాంతాలు నచ్చి బౌద్ధమతాన్ని 14 ఆక్టోబర్ 1956న 5లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలిపారు. నేటితో ఆది 69 సంవత్సరాలు అన్నారు . ఈ ఆధునిక ప్రపంచానికి సరిపోయేది భౌద్ధ మతమే అని , ఈ ప్రపంచాన్ని రక్షించ గల శక్తి ఓక భౌద్ధ మతానికి మాత్రమె ఉందని మానవత విలువలు వైపు . నడిపించేధి భౌద్ధం మతం అని వారన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జిల్లా నాయకులు నిమ్మల భద్రయ్య, బండారి రాజు, నేర్పటి శ్రీనివాస్ ,అంబేద్కర్ అంబేద్కర్ గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్, ప్రభాకర్ , బండారి దిలీప్, బొచ్చు నరసయ్య, గుడిమల్ల రమేష్ ,శనిగరపు మొగిలి చిలువేరి,సుమన్, మంగళపల్లి జెమిని, బండారి బాబు తదితరులు పాల్గొన్నారు