
భద్రాచలం నేటి ధాత్రి
డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ ( ప్రభుత్వ వైద్యులు, భద్రాచలం )
ప్రపంచ అనస్థీషియా డాక్టర్ల దినోత్సవం సందర్భంగా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో భద్రాచలం లో ఉన్నటువంటి అనస్థీషియా డాక్టర్లందరూ ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ కోటిరెడ్డి చరవాణి లో మాట్లాడుతూ భద్రాచలం లోని అనస్థీషియా డాక్టర్లు మరియు భద్రాచలం లోని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.
డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ సర్జరీలు జరిగేటప్పుడు అనస్థీషియా డాక్టర్ల యొక్క ప్రమూఖ్యత మరియు వారి విలువైన సేవలు గురించి కొనియాడారు.
డాక్టర్ మల్లేష్ మాట్లాడుతూ అనస్థీషియా రంగంలోని వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోని వారి యొక్క వెలకట్టలేని పాత్ర గురించి గుర్తు చేశారు.
డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ ఆంగ్ల అక్షరమాల లో A మొదటి వరస లో ఎలా ఉంటుందో, ప్రపంచంలోని అనస్థీషియా వైద్యులు మొదటి వరసలో ఉండి మానవాళికి సేవలు అందిస్తున్నారు అని తెలిపారు.
డాక్టర్ శివరామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలోని డాక్టర్స్ అందరి యొక్క ఆయువుప్రామాణాలతో పోలిస్తే అనస్థీషియా వైద్యులు తొందరగా మృత్యువాత పడుతున్నా కానీ, మానవాళి క్షేమం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పాటు పడుతున్న అనస్థీషియా వైద్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రేజరర్ డాక్టర్ సురేష్ కుమార్ భద్రాచలం లోని అనస్థీషియా వైద్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసారు.
ఈ కార్యక్రమంలో అనస్థీషియా వైద్యులు అబ్దుల్ లతీఫ్ , నిఖిత, రమేష్ చంద్ర, లోకేష్, మల్లేష్, శివరామకృష్ణప్రసాద్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రేజరర్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గున్నారు.
ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు, సిటీ స్టైల్ జిమ్ సభ్యులు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.