ఐటీ కోతలతో అసంతృప్తిలో కార్మికులు

మందమర్రి, నేటిధాత్రి:-

బొగ్గు గని కార్మికులు 11వ వేజ్ బోర్డ్ లో మెరుగైన వేతనం ఒప్పందం చేసుకొని, మంచి జీతాలు తీసుకుంటున్నప్పటికి ఇన్కమ్ టాక్స్ (ఐటీ) పేరుతో వేతనంలో భారీ కోతలు విధించడం వలన కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం ఏరియాలోని కేకే 5గనిపై యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోలిండియాలో అలవెన్స్ లపై ఐటిని యాజమాన్యం ధరిస్తుందని, ఈ ఒప్పందాన్ని సింగరేణిలో అమలు చేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ గుర్తింపు కార్మిక సంఘం చేతకాని విధానాల వలన ఇక్కడ ఆ ఒప్పందం అమలు చేయకపోవడం బాధాకరమని, అలవెన్స్లపై ఐటిని యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం కోసం యాజమాన్యం ప్రతి కార్మికుడికి కార్మికుడికి రెండు గుంటల భూమి,20 లక్షల రూపాయల వడ్డీ లేని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, యూనియన్ ఆద్వర్యంలో పోరాటాల రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు. 11వ వేజ్ బోర్డ్ కు సంబంధించిన 23 నెలల ఏరియార్స్ ను రెండు దఫాలుగా ఇవ్వాలని యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల గందరగోళాన్ని గురిచేసినప్పుడు ఏఐటియుసి కోలిండియా ఒకేసారి చెల్లిస్తున్నందున సింగరేణిలో సైతం ఒకేసారి చెల్లించాలని పోరాటాలు చేసిందని, పోరాటాలు దిగివచ్చిన యాజమాన్యం, ప్రభుత్వం ఏరియార్స్ ఒకే సారి చెల్లించడం జరిగిందని, ఇప్పుడు చేతగాని గుర్తింపు సంఘం తమ యూనియన్ నే ఏరియార్స్ ఒకే సారి ఇప్పించిందని ప్రగల్భాలు పలకడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న టిబిజికెఎస్ ను వారి ప్రభుత్వమే దగ్గర తీయడం లేదని, నేడు రాజకీయ ఆధిపత్యం కోరుతూ సంఘాన్ని పక్కనపెట్టి, సింగరేణిలో ఆర్థిక దోపిడీకి పూనుకున్న ఏనాడు ప్రభుత్వంపై పోరాటం చేయని వారు నేడు ఏఐటీయూసీ విమర్శించడం సిగ్గు చేటు అని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా కార్మిక శ్రేయస్సు దృష్ట్యా కార్మిక వర్గ పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. సింగరేణిలో కార్మిక వర్గ పోరాటాలకై పోరాడే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ అని, యువ కార్మికులు రానున్న రోజుల్లో పోరాటాల ద్వారా కార్మిక హక్కులను కాపాడే సంఘాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. బొగ్గు అధికార సంఘం సభ్యులు కార్మికుల వేతనాల పెరుగుదలను చూసి ఓర్వలేక జబల్పూర్ లో హై కోర్టులో వేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐదు జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో 72గంటల సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సంస్థకు వచ్చిన లాభాలు నుండి 35శాతం లాభాల బాట కార్మికులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కుట్రలు చేసి, కాలయాపన చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తక్షణమే సింగరేణి ఎన్నికల జరిపి, సంస్థను ఆర్థిక దోపిడీ నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, సహాయ కార్యదర్శి సోమశెట్టి రాజేష్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, నాయకులు దేవసాని సాంబయ్య, సిహెచ్పి శర్మ, మర్రి కుమార్, పెద్దపల్లి బానయ్య, గాండ్ల సంపత్‌, సట్ల కొండయ్య, ఆంటోని దినేష్, పి చంద్రశేఖర్, గడ్డం సంతు, శ్రీనివాస్, సంతు,కండె రాజకుమార్, రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *