
సిపిఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి
కొమురవెల్లి నేటిధాత్రి
కొమురవెల్లి మండల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు. శనివారం తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ శ్రీనివాస్ కు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వినతి పత్రం ఇచ్చారు అనంతరం సత్తిరెడ్డి మాట్లాడుతూ మండలంలో వరి కోతలు ప్రారంభించి 15 రోజులు దాటిన అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం అమ్ము కుంటున్నారని తెలిపారు. వెంటనే కేంద్రాలు ప్రారంభించి వడ్లు కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తేలు ఇస్తారీ ,వుల్లంపల్లి సాయిలు, నాయకులు చెరుకు వెంకట్ రెడ్డి, అరుట్ల రవీందర్ నూకల శ్రీనివాస్, సార్ల యాదయ్య ,పాకనాటి కొండలు, బోoధము నరసింహులు తదితరులు పాల్గొన్నారు