ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహిళల నిరసన
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం
మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు.కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసం కరుణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తా అన్న హామీలను నెరవేర్చలేకాపోవడంతో పాటు వంద రోజులలోనే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని మోసం చేసిందని ఎద్దేవా చేశారు.పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు కళ్యాణ లక్ష్మి పథకం కింద కెసిఆర్ ప్రభుత్వం ఇస్తున్న రూ. 1 లక్ష 16 తో పాటుతో పాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటివరకు ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదన్నారు.ఎన్నికలకు ముందు ప్రతి మహిళకు ప్రతినెల 2500 అకౌంట్ లో వేస్తామని హామీ ఇచ్చి మాటతప్పారని అలాగే వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇస్తామన్నా రూ. 4 వేల పెన్షన్ ఇవ్వలేదని వివరించారు.చదువుకుంటున్న విద్యార్థినిలకు స్కూటీలు అలాగే విద్యా భరోసా కార్డు కింద విద్యార్థినిలకు ఐదు లక్షలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసం కరుణ, మహిళా కమిటీ బాధ్యులు నాయిని సునీత, చింతం విజయరాణి, బొచ్చు సరళ వడ్లుకొండ స్వరూపా ఆధ్వర్యంలో పాల్గొన్న మహిళ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
