
Hospital
108 అంబులెన్సు లో మహిళ ప్రసవం
నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట పట్టణంలో నివాసముంటున్న బీహార్ కు చెందిన మహిళ మనిషేదేవ్ పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్న సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలో 108 ఈఎంటి స్వామి అంబులెన్స్ లో ప్రసారం చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.