
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. తోడేటి సౌందర్య(60) మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో గల పత్తి అంటుకోవడంతో ఆర్పే ప్రయత్నం లో షాకు కు గురై మంటల్లో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మంటల్లో పత్తితో పాటుగా నిల్వ ఉంచిన బియ్యం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అగ్నిలో 8క్వింటాళ్ల పత్తితో పాటు 6 క్వింటాళ్ల బియ్యం కాలి బూడిద కావడం జరిగింది.
మృతురాలికి భర్త ముగ్గురుకుమారులు,ఒక కూతురు కలరు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు