
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కేంద్రం గణప సముద్రం చెరువులో మతిస్థిమితం కోల్పోయిన మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మామిండ్ల మల్లికార్జున్ భార్య మామిళ్ళ లీల (56) మృతదేహం గణప సముద్రం చెరువులో తేలియడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీపించి విచారణ చేపట్టగా మృతురాలు కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులుగా అప్పగించారు.