వైరా బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఆకాంక్షిస్తూ.గౌసుద్దీన్.ఆద్వర్యంలో సంబురాలు జరుపుకున్న నాయకులు.

ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మండల నాయకులు ప్రజాప్రతినిధులు.

కారేపల్లి నేటిధాత్రి.

కెసిఆర్ చేతుల మీదుగా బి ఫారమ్ అందుకుంటున్న వైరా బి అర్ యస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ భారీ మెజారిటీతో గెలుపొందాలని బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు గౌసుద్ధీన్ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్ ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. అనంతరం కారేపల్లి బస్టాండ్ సెంటర్లో ఆనందోత్సవాలతో టపాసులు కాల్చి స్వీట్లు పంచారు.ఈ సందర్భంగా ఉమాశంకర్ మాట్లాడుతూ బీఫారమ్ అందుకున్న వైరా అభ్యర్థి బానోత్ మదన్ లాల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడప ప్రచారంలో ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, జడ్పీటిసి జగన్, వైఎస్ ఎంపిపి రావురి శ్రీనివాస్ రావు, సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య , ముత్యాల సత్యనారాయణ, ఉన్నం వీరేందర్,జావాజీ శ్రీనివాస్,దుగ్గినేని శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాస రావు,ఎండి హనీఫ్,ఆదేర్ల రామారావు, తొగర శ్రీను, సర్పంచ్ కుమార్, ఆదేర్ల రాదాగోవిందు, సోమందుల నాగరాజు, చందు నాయక్,గంగరబోయిన సత్యం,బట్టు కళ్యాణ్,చింతల శ్రీను,తోటమల్ల సాయి, సుజాత,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *